కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడిన తరువాత ఆ పార్టీలోని మరికొందరు అసంతృప్తులూ అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసిన కన్నా ఇంటికి విష్ణుకుమార్ రాజు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీలో పరిస్థితులు ఏమాత్రం బాగులేవని.. పార్టీలోని సమస్యలను హైకమాండ్‌కు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందో అర్థం కావడంలేదని… కార్యకర్తలతో మాట్లాడే తీరిక అధిష్టానానికి లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. పార్టీలో విభేదాల గురించి అధిష్టానానికి చెప్పినా స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కన్నాతో ఉన్న వ్యక్తిగత అనుబంధం కారణంగా వచ్చి కలిసినట్లు ఆయన చెప్పారు. తాను పార్టీ మారబోవడం లేదని అన్నారు. అయితే, విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల తీవ్రత చూసినవారంతా ఆయన పార్టీ మారడం ఖాయమంటున్నారు.
టీడీపీతో పొత్తులలో భాగంగా 2014లో విష్ణుకుమార్ రాజు విశాఖ సిటీలో గెలిచారు. 2019 నాటికి బీజేపీ, టీడీపీ విడిపోయాయి. దీంతో 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా విష్ణుకుమార్ రాజు ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన పార్టీలో చురుగ్గానే ఉన్నప్పటికీ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడైన తరువాత ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. దీంతో ఆయన కూడా సైలెంటయ్యారు. ఇప్పుడు కన్నా బీజేపీని వీడడంతో విష్ణకుమార్ కూడా వీడుతారన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కన్నా లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పంపింది. గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కన్నాతో భేటీ అయ్యారు. టీడీపీలోకి ఆయన్ను ఆహ్వానించారు. ఈ నెల 23న టీడీపీలో చేరాలని కన్నాను ఆహ్వానించామని.. పార్టీ తరఫున తాను వచ్చానని.. ఇది మర్యాదపూర్వక భేటీ అయిన ఆ సమావేశం తరువాత ఆలపాటి రాజా మీడియాకు చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి బలమైన నేత చేరడం టీడీపీకి మంచి పరిణామమని రాజా అన్నారు. కాగా కన్నా లక్ష్మీనారాయణ 23న చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరనున్నారు. తన చేరిక భారీగా ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on February 21, 2023 9:26 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…