తెలంగాణ బీజేపీ ఫైర్‌బ్రాండ్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ట్వీట్ చేశారు. తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని.. ఆయనకు పదే పదే ఫోన్లు కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజాసింగ్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.
విషయం ఏంటంటే..
ఇటీవల కాలంలో తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు పనిచేయడం లేదని.. పదే పదే మొరాయిస్తోందని రాజాసింగ్ తెలిపారు. దీనిని మార్చాలని కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వాలని ఆయన నేరుగా సీఎం కేసీఆర్‌ను కోరారు. అయితే రాజాసింగ్ విజ్ఞప్తిని ప్రషభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆయన అదే కారులో ప్రగతి భవన్‌కు వెళ్లి.. అక్కడ హల్ చల్ చేశారు. కారును అక్కడే వదిలేసి వచ్చారు. దీంతో పోలీసులు సదరు కారును స్టేషన్‌కు తరలించారు.
ఇదిలావుంటే.. తదుపరి రోజు అసెంబ్లీకి రాజాసింగ్ నేరుగా బుల్లెట్ పై రావడం.. తనకు కారు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని ఆరోపించడం తెలిసిందే. తాజాగా ఆయన తనకు ప్రాణ హాని ఉందంటూ.. వ్యాఖ్యలు చేశారు.
తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వెల్లడించారు. “నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి” అని ట్వీట్ చేశారు. మరి దీనిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర పోలీసులు ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on February 21, 2023 9:18 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…