ప్రధాని నరేంద్ర మోడీ అంటే.. దేశానికి అధినేత. ఆయన ఎక్కడకు వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతాలు.. శుభాకాంక్షలు.. అభినందనలు .. ఆయన దర్శనం అయితే చాలు.. అనుకునే నాయకులు అబ్బో.. అనిపించే అతిథి మర్యాదలు. ఇక, ఆయన కోరితే అనుమతు లేం ఖర్మ ఏపీ వంటి రాష్ట్రాల్లో అయితే.. రాజ్యసభ టికెట్లు, ఆయన మిత్రులకు పోర్టులు, కార్పెట్లు వగైరా వగైనా ఇచ్చేస్తున్న పరిస్థితి తెలిసిందే. అయితే.. తొలిసారి నరేంద్ర మోడీని ధిక్కరించిన రాష్ట్రం ఒకటుంది. అదే మేఘాలయ. ఈ నెల 27న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోడీ అక్కడ పర్యటించాలని అనుకున్నారు.
కానీ, అందరిలా తానెందుకు ఉండాలని అనుకున్నారో.. ఏమో.. అక్కడి ముఖ్యమంత్రి.. మోడీ రోడ్ షోకు.. బహిరంగ సభకు కుదరదని తేల్చి చెప్పేశారు. దీంతో షాక్ తినడం మోడీ వంతైంది. మేఘాలయలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీకి రెడీ అయ్యారు. అయితే, అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలో పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని ఈ నెల 24న ర్యాలీ నిర్వహించాల్సి ఉంది.
అయితే రాష్ట్ర క్రీడా శాఖ ఆ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే స్పందించారు. “పీఏ సంగ్మా స్టేడియంలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం సరికాదు. స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే అక్కడ మైదానంలో నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ఉంది. అందుకు ప్రధాని మోడీ సభకు అనుమతివ్వలేదు. పత్యామ్నాయ వేదికగా అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియం పరిశీలిస్తున్నాం.” అని తెలిపారు.
అయితే.. ఈ ఘటనపై బీజేపీ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయింది. ‘పీఏ సంగ్మా స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అందుబాటులో లేదని ఎలా చెబుతారు. కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా బీజేపీని చూసి భయపడుతున్నారు. వారు మేఘాలయలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రధాని ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు.. కానీ మేఘాలయ ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు తమ మనసును మార్చుకున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బీజేపీని రాష్ట్రంలో ఎదగకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్నా యి.’ అని బీజేపీ నేత ఒకరు విమర్శించారు.
This post was last modified on February 20, 2023 11:36 pm
అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే... ఏదో…
దేవర 1 కి మొదట వచ్చిన టాక్ తో ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మేకర్స్ కాస్త కంగారు పడ్డారు.…
ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని…
'పద్మ శ్రీ' వంటి ప్రతిష్టాత్మక పౌర సన్మానాలు అందరికీ దక్కవు. దీనికి ఎంతో పెట్టిపుట్టి ఉండాలన్న చర్చ నుంచి నేడు…
ఓ సీఎం ప్రెస్ మీట్ అంటే.. లెక్కలేనన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు, ప్రింట్ మీడియా… ఆయా సంస్థలకు…
2000 తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. తొలి సినిమా ‘చెలి’ మొదలుకుని.. మూడేళ్ల…