Political News

డైలామాలో కాపులు.. కిం క‌ర్త‌వ్యం?

అదేంటి.. అనుకుంటున్నారా? ఔను! నిజ‌మే. కాపు సామాజిక వ‌ర్గం ఇప్పుడు పూర్తిస్థాయి డైల‌మాలో ప‌డిపోయింది. తాము ఒంట‌రిగా ఎద‌గాల‌ని.. రాజ‌కీయంగా శాసించాల‌ని.. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకుడే ముఖ్య‌మంత్రి కావాల‌ని కొన్నాళ్లుగా కాపులు ఉద్య‌మిస్తున్నారు. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర‌చుగా మాత్రం ఈ డిమాండ్ వారి నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. వారంతా డైల‌మాలో ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది.

నిజానికి కాపులు జ‌న‌సేన పార్టీపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌నేది వారి చిర‌కాల వాంఛ‌గా మారిపోయింది. ఆ మాట‌కొస్తే… మెగా కుటుంబం నుంచి ఒక‌రిని కీల‌క ప‌ద‌విలో చూడాల‌నేదివారి కోరిక‌. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని.. కొన్నాళ్లు గా డిమాండ్ వినిపిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట కాపు నాడు నాయ‌కులు భేటీ అయి ప‌వ‌న్ కోసం ఏమైనా చేయాల‌నే తీర్మానం చేసుకున్నారు.

కానీ, ప‌వ‌న్ మాత్రం టీడీపీ ఇత‌ర పార్టీల‌తో పొత్తుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది కాపులు తాజాగా చేసిన ఆరోప‌ణ‌. రెండు రోజుల కింద‌ట జ‌గ్గ‌పేట‌లో నిర్వ‌హించిన అతి ర‌హ‌స్య స‌మావేశంలో ప‌వ‌న్‌పై గుర్రుగా ఉన్న నాయ‌కులు నోరు విప్పేశారు. ఇప్పుడు మ‌నం ఏం చేయాలి? అనేది వారి మ‌ధ్య ప్ర‌ధానంగా సాగిన సంభాష‌ణ‌. కాపు నాయ‌కులే కాపుల‌కు ద్రోహం చేస్తున్నార‌నే భావ‌న వారి నుంచిరావ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం కూడా!

కాపులు రాజ‌కీయంగా ఎదిగేందుకు ప‌వ‌న్ ఒక వంతెన‌గా మారుతార‌ని.. ఆశించామ‌ని, కానీ, ఆయ‌న టీడీపీతో పొత్తు కోస‌మే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు బాహాటంగానే విమ‌ర్శించారు. టీడీపీ తో పెట్టుకుని కాపుల‌కు న్యాయం జ‌రుగుతుందా? అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. కాపుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఒక‌టి రెండు మంత్రి ప‌ద‌వులు ఇచ్చేస్తే.. స‌రిపోతుందా? అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. ఈ స‌మావేశంలో కొంద‌రు నాయ‌కులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

కాపుల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని క‌న్నాపై ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు తెలిసింది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాపులు వ్య‌క్తిగ‌తంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల్సిందిపోయి.. మ‌ళ్లీ ఏదో ఒక పార్టీకి అంట‌కాగితే.. మ‌ళ్లీ స‌మ‌స్య‌లు య‌థాతథంగానే మిగిలిపోతాయ‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే.. ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యంపై మాత్రం ఎవ‌రూ కూడా పూర్తిస్థాయిలో నిర్ణ‌యానికి రాలేక పోయారు. మ‌రోసారి భేటీ త‌ర్వాత ఏదో ఒక విష‌యాన్ని నిర్ణ‌యించాల‌ని తీర్మానం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 20, 2023 11:55 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago