గన్నవరం ఎమ్మెల్యేల వల్లభనేని వంశీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్వపక్షం వైసీపీలోనూ, వివక్షం టీడీపీలోనూ నేతలు వంశీపై దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వెంత, నీ బతుకెంత అన్నట్లుగా ప్రత్యర్థులు డైలాగ్స్ విసరడంతో వంశీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు…
వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి ఆధికార పార్టీలో ఒక వర్గం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రకటనలు ఇస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పిలిస్తేనే వైసీపీలోకి వచ్చారని, ఆయన ఆదేశం మేరకే పనులు చేసుకుంటూ వెళ్తున్నానని వంశీ చెప్పినప్పటికీ వైసీపీ నేతలు వినే అవకాశం కనిపించడం లేదు. వంశీకి 2024లో టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని వైసీపీ నేతలు ప్రకటించారు యార్లగడ్డ వెంకట్రావు వర్గం వంశీని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించకూడదని గతేడాది ఉద్యమించిన వెంకట్రావు వర్గం.. వంశీకి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా 30 వేల మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతోంది..
తాజాగా గన్నవరం టీడీపీ నేతలు వంశీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన గతంలో మాట్లాడిన మాటలు, ఇటీవలి కామెంట్స్ అన్నింటినీ కలిపి విమర్శిస్తున్నారు. తిట్ల దండకం అందుకున్నారు. చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టకపోతే వంశీ ఎక్కడ ఉండేవారని టీడీపీ నేత దొంతు చిన్నా ప్రశ్నించారు. భువనేశ్వరిని నోటికొచ్చినట్లు మాట్లాడిన వంశీని క్షమించే ప్రసక్తే లేదని ప్రకటించారు. వంశీ ఎక్కడ నుంచి వచ్చారో, ఆయన ఎలా ఎదిగారో గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ లేకపోతే వంశీ ఎక్కడ ఉండేవారో అర్థం చేసుకుంటే ఆయన అసలు బండారం బయట పడుతుందన్నారు…
వంశీని ఓడించడానికి చంద్రబాబు లోకేష్ రావాల్సిన అవసరం లేదని, ఆయన్ను ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. లోకేష్ మినిష్టర్ గా ఉన్పప్పుడే గన్నవరానికి నిధులు ఇచ్చారని, వైసీపీ హయాంలో పైసా కూడా విదిల్చలేదని చెప్పుకొచ్చారు. పక్కనున్న వాళ్లంతా తన వాళ్లనుకుని వంశీ విర్రవీగిపోతున్నారని అది ముమ్మాటికి నిజం కాదని దొంతు చిన్న హెచ్చరించారు..
వంశీ ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది. టీడీపీలో గెలిచిన వంశీ రాజకీయ అవసరాల కోసం వైసీపీలో చేరి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడయ్యారు. పైగా నోటి దురుసుతనంతో నిత్యం ఏవేవో మాట్లాడుతూ అందరికీ దూరమయ్యారు. పరిస్థితులను అధ్యయనం చేస్తూ కొంతకాలం పాటు మౌనంగా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు వంశీపై ఫుల్ లెన్త్ అటాక్ మొదలెట్టారు. వైసీపీలోనూ అంతర్గత పోరు కారణంగా వంశీకి ఇప్పుడు ఓటమి భయం పట్టుకున్నట్లు చెబుతున్నారు… అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం డౌటేనని చెబుతున్నారు…
This post was last modified on February 20, 2023 1:34 pm
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…