ఏపీలో జంప్ జిలానీలు ఇంకా పెరుగుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ జంప్ చేసే నేతల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కంటే కూడా.. వైసీపీలో ఎక్కువగా జంప్ చేసే నేతలు పెరుగుతున్నారని పార్టీలోనే గుసగుస వినిపిస్తోంది. సీఎం జగన్‌పై మునుపు ఉన్న విశ్వాసం .. ఇప్పుడు నేతలకు లేకుండా పోయిందని కూడా అంటున్నారు.
అయితే.. ఎవరూ కూడా ఇప్పటికిప్పుడు బయటపడడం లేదు. ఎన్నికలకు మూడు లేదా.. ఆరు మాసాల ముందు.. వైసీపీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందు కంటే.. తమకు టికెట్ రాకపోతే.. అలకలు.. బుజ్జగింపులకు ఎవరూ ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో పోటీకి రెడీ అవుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నారు ఇండిపెండెం ట్‌గా అయినా.. పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక, పొరుగు పార్టీ తరఫున పోటీకి రెడీ అవుతున్న వారు కూడా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం గా వచ్చే ఏడాది లేదా.. ఈ ఏడాది చివరి నాటికి జంప్ జిలానీల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఇదే జరిగితే.. వైసీపీకి నష్టం కలగడం ఖాయమనే లెక్కలు వస్తున్నాయి. ఇక, టీడీపీని చూసుకున్నా.. పార్టీపై నమ్మకం ఉన్నప్పటికీ.. తమకు టికెట్ వస్తుందో రాదో అనే సమస్యవారిని వెంటాడుతోంది.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటే..తమకు ఎసరు ఖాయమని 40 నుంచి 50 మంది నాయకులు అనుకుంటు న్నారు. దీంతో వీరు కూడా పక్క చూపులు చూస్తున్నారు. అయితే.. ఒంటరిగా పోటీ చేసే సాహసం వీరికి లేదు. అందుకే వైసీపీ వైపు చూస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. వైసీపీలోనూ టికెట్ వచ్చే పరిస్థితి లేని వారు.. మాత్రం పరిస్థితులను బట్టి అడుగులు వేసే అవకాశం ఉంది. అయితే.. ఎవరు ఎటు వెళ్లినా.. ఆయా పార్టీలకు నష్టం మాత్రం ఖాయమని చెబుతున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 18, 2023 11:11 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…