Political News

‘వారాహి’ ఏమైంది? అందుకే బ్రేక్ ప‌డిందా..?


వారాహి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్రారంభించేందుకు రెడీ చేసిన వాహ‌నం. దీనిపై అనేక చ‌ర్చ‌లు.. విమ ర్శ‌లు.. వివాదాలు కూడా వ‌చ్చాయి. ఏదో ఒక విధంగా అయితే.. వాహ‌నం రెడీ అయింది. కొండ‌గ‌ట్టు, విజ యవాడ‌, అన్న‌వ‌రం.. క్షేత్రాల్లో ప్ర‌త్యేక పూజ‌లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది.. వారాహి యాత్ర కూడా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ప్ర‌జ‌ల్లో మార్పు కోసం.. ఈ యాత్ర‌ను చేప‌డుతు న్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది.

ఇక‌, వారాహి రాక‌తో రాజ‌కీయాల్లోనూ కీల‌క మార్పులు చోటు చేసుకుంటాయ‌ని కూడా అనుకున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ యాత్ర విష‌యంలో అటు ప‌వ‌న్ నుంచి కానీ.. ఇటు నేత‌ల నుంచి కానీ ఎలాంటి ప్ర‌కట‌నా రాలేదు. అంతేకాదు.. అస‌లు వారాహిని ఎక్క‌డ ఉంచారో(మంగ‌ళ‌గిరిలోని కార్యాల‌యంలో అంటు న్నా.. అక్క‌డ లేదు) కూడా తెలియ‌డంలేదు. అయితే.. వారాహి రాక‌పోవ‌డానికి.. ప‌వ‌న్ ప్ర‌చారం చేయ‌క పోవ‌డానికి మూడు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయ‌నే గుస‌గుస రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

1) ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డం. నిజం చెప్పాలంటే.. వారాహికి పూజ‌లు చేయించి న అనంత‌ర‌మే దీనిని లైన్‌లో పెట్టాల్సి ఉంది. అప్ప‌టికి రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ లేదు. మ‌రి అప్ప‌టికి కూడా ప్రారంభంచ‌లేదు. సో.. దీనివెనుక ఇంకో కార‌ణం ఉంద‌ని అంటున్నారు.

2) టీడీపీ యువ‌నాయక‌డు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. దీనికి వారాహి యాత్ర పోటీ అవుతుందేమోన‌నే సందేహాలు ఉన్నాయి. అందుకే .. యాత్ర‌ను ప్రారంభించ‌లేద‌నే మ‌రోవాద‌న కూడా ఉంది. అయినా.. కూడా వారాహి రూట్ మ్యాప్ వేరే గా ఉన్న‌ప్పుడు.. యువ‌గ‌ళానికి వ‌చ్చిన ఇబ్బంది లేద‌ని కొంద‌రు అంటున్నారు. ఈ క్ర‌మంలో ఇంకో కీల‌క కార‌ణం ఉండి ఉంటుంద‌ని చెబుతున్నారు.

3) బీజేపీ పెద్ద‌లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను నిలువ‌రించార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా రాజకీయ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ‌కువ‌స్తోంది. ఔన‌న్నా..కాద‌న్నా.. బీజేపీతో బంధాన్ని తెంచుకునేందుకు ప‌వ‌న్ సుముఖంగా లేరు. దీనికి వేరేకార‌ణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ పెద్ద‌లు ‘ఇప్పుడే వ‌ద్దు’ అని చెప్పార‌ని.. తాము ముహూర్తం నిర్ణ‌యించి స‌మాచారం అందిస్తామ‌ని అప్పుడు యాత్ర‌ ప్రారంభిచాల‌ని చెప్పార‌ని.. అందుకే వారాహి యాత్ర‌ను పోస్ట్ పోన్ చేసుకున్నార‌ని అంటున్నారు. ఇదీ.. సంగ‌తి..!

This post was last modified on February 17, 2023 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

9 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

49 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago