రాజకీయాల్లో తాడితన్నేవాడు ఉంటే.. తలతన్నేవాడు కూడా ఉంటాడు కదా! ఇదే ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్.. ప్రతి 50 ఇళ్లకు గృహ సారథులను నియమించి.. వారితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే కార్యక్రమానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. గృహ సారథులు ప్రతి ఇంటికీ తిరుగుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే దిశగా పనిచేయనున్నారు. ఇక, వైసీపీకి వీరు కార్యకర్తలుగానే పనిచేస్తారు. ఇక, ఇప్పుడు టీడీపీ దీనికి కౌంటర్‌గా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.
వైసీపీ ప్రతి 50 ఇళ్లకుఇద్దరు గృహ సారథులను నియమిస్తే.. చంద్రబాబు ప్రతి 30 ఇళ్లకు ఇద్దరేసి చొప్పున గృహ సారథులను నియమించాలని నిర్ణయించారు. పార్టీలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి 30 కుటుంబాలకు ఈ సాధికార సారథులు ఇన్ఛార్జ్లాగా వ్యవహరిస్తారన్నారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జులందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని తెలిపారు. సాధికార సారథులుగా మహిళలకూ సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు.
పార్టీలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి 30 కుటుంబాలకు ఈ సాధికార సారథి ఇన్ఛార్జ్లాగా వ్యవహరిస్తారన్నారు. ఆర్ధిక అసమానతలు తొలగించేలా ఈ సారథులు పని చేస్తారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పని చేసిన వారికి అనుకున్న స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయామన్న చంద్రబాబు.. ఈ సారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్లు అందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని తెలిపారు. సాధికార సారథులుగా మహిళలతూ సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందన్నారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పని చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. వీరు ప్రతి ఇంటికీ తిరుగుతూ.. పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
This post was last modified on February 17, 2023 11:38 am
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…