Political News

జ‌గ‌న్ రెడ్డీ.. ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పు: ప‌వ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. విశాఖ‌లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న‌ పై సీఎంను ఆయ‌న నిల‌దీశారు. “రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పితీరాలి” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని మండిపడ్డారు. ఆస్పత్రులను మెరుగుపరచని వైసీపీ పెద్దలు, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని పవన్ విమర్శించారు.

బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం మోటార్ సైకిల్‌పై వెళ్లిన ఆ గిరిజన దంపతులతో పాటు ప్ర‌జ‌ల‌కు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రి లో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయమని పవన్ అన్నారు. ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదని, కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రిపడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని, ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

మహాప్రస్థానం వాహనాలే కాదు, అంబులెన్సుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండటం లేదని, బెంజి సర్కిల్లో అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు రూ.14 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చామని చెబితే సరిపోదని, ప్రజలకు సేవలు అందాలన్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే విశాఖలో రాజధాని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు.

ఏం జ‌రిగిందంటే

విశాఖ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. విశాఖ‌లో మంచిపేరున్న కింగ్ జార్జ్ హాస్ప‌ట‌ల్‌(కేజీహెచ్‌)లో చనిపోయిన బిడ్డను తీసుకెళ్లేందుకు త‌ల్లిదండ్రులు అంబులెన్స్‌ను కోరారు. అయితే.. ఎంత బతిమాలినా ఆస్పత్రి సిబ్బంది కనిక‌రించ‌లేదు. ఇదే స‌మ‌యంలో ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో గత్యంతరం లేక మృతదేహాన్ని స్కూటీ పై పెట్టుకుని పాడేరు వరకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అక్కడ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ఆస్పత్రి సిబ్బంది.. పాడేరు నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఈ ప‌రిణామంపై రాజ‌కీయ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.

This post was last modified on February 17, 2023 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago