వైసీపీ సర్కారుకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ముఖ్యంగా సీఎం జగన్‌కు ఇబ్బందిగానూ మారింది. త్వరలో నే రాష్ట్ర వ్యాప్తంగా గృహ సారథులు అనే కాన్సెప్టును అమలు చేయాలని సీఎం జగన్ భావించారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరేసి చొప్పున గృహ సారథులను నియమించాలని యోచిస్తున్నారు. వీరు పూర్తిగా పార్టీకే అంకి తం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. అంతేకాదు.. ప్రజ లను వైసీపీవైపు మళ్లించాలి.
ఇక, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేయాలి. ఇదీ.. గృహసారథులు ఇతమిత్థంగా చేయాల్సిన పని. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలు చేయాలని పార్టీ తరఫున ఆదేశాలు కూడా వెళ్లిపోయాయి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు సమస్యల్లా.. అసలు గృహ సారథులుగా పనిచేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని .. పార్టీ చెబుతోంది. వీటిని పరిష్కరించాలని కూడా చెబుతున్నారు.
ప్రధానంగా గృహసారథులకు వేతనాలు లేవు. ఇదే పెద్దచిక్కుగా భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు.. ఎంపీలు జీతాలు తీసుకుంటున్నారు.. మేం వారి తరఫున ప్రజలకు ప్రచారం చేసి.. వారిని గెలిపిస్తే.. మాకు వచ్చే దేంటి.. పైగా రోజంతా కూడా ప్రజల మద్యే ఉండాలి. ఎమ్మెల్యేలు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు వెళ్లాలి.. సో మాకు గిట్టు బాటు కాదని.. చాలా మంది ఎంపికైన వారు కూడా తూర్పుగోదావరి జిల్లాలో మానేశారు. ఇక, రెండో కారణం.. ప్రజలు నిలదీస్తారనే భయం.
ప్రస్తుతం ప్రభుత్వం పై ప్రజల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉంది.. దీనిని తమపై చూపిస్తారని మెజారిటీ గృహసారథులు అభిప్రాయపడుతున్నారు. మూడో సమస్య.. పార్టీ తరఫున పనిచేస్తున్న తమకు రక్షణ ఏంటనేది గృహసారథుల ప్రశ్న. ప్రతిపక్షాలు తమపై దాడులు చేస్తే.. ఎవరు తమను ఆదుకుంటారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యేలు ఎంత వరకు పూచీ పడతారనేదివారి ప్రధాన ప్రశ్న. ఇక, వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే.. తమపై దాడులు చేసే అవకాశాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో గృహసారథుల నియామకం.. ప్రస్తుతం ఇరకాటంలో పడింది.
This post was last modified on February 12, 2023 3:18 pm
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…