నెల్లూరు పెద్దారెడ్లు! ఈ మాట అనగానే.. వారంతా .. జగన్ మనుషులు.. వైసీపీ నాయకులు అనే మాటే విని పిస్తుంది. దీనికి కారణం.. గతంలో జగన్ చేసిన పాదయాత్రలో సీమసహా కోస్తాలో అయిన ఖర్చంతా వారే భరించారట. పైకి కనిపించే నాయకులను కూడా తెరవెనుక ఉండి నడిపించేది ఈ రెడ్లే నని రాజకీయాల్లో బలంగా నమ్ముతారు. ఇదినిజం కూడా! ముఖ్యంగా జగన్ సీఎం కావాలని కోరుకున్న రెడ్డి వర్గంలో నెల్లూరు పెద్దారెడ్లు చాలా ముందున్నారు.
అయితే.. రోజులన్నీ.. ఒకేలా ఉండవు కదా! రెడ్లు చేస్తున్న వ్యాపారాలు కానీ, వారు చేసే కాంట్రాక్టు పనులు కానీ.. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారికి దన్నుగా కూడా నిలవడం లేదు. పనులు చేస్తున్నా..రూపాయి విదల్చడం లేదు. దీంతో నెల్లూరు పెద్దారెడ్లు మనసు మార్చుకున్నారని కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తోంది. పైగా.. నెల్లూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. వైసీపీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వారికి ఏమాత్రం నచ్చడం లేదని అంటున్నారు.
ఇక్కడ గతం గురించి చర్చించుకోవాలి. గత ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్‌రెడ్డిని తీసుకువచ్చి నెల్లూరు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆదాల రెడ్డి వర్గం నేతే అయినా.. నెల్లూరు పెద్దారెడ్లకు ఆయనకు, సోమిరెడ్డి చంద్ర మోహన్‌కు అస్సలు పడదు. దీంతో ఆదాల ఓడిపోవాలని కోరుకున్నారు అయితే.. ఆయన జగన్ గాలిలో కొట్టుకొచ్చారు. ఇక, నెల్లూరు రెడ్లకు తల్లో నాలుకగా వ్యవహరించే కోటంరెడ్డి వంటివారిని పార్టీ దూరం చేసుకుంది. దీంతో ఇప్పుడు రెడ్డి వర్గం అంతా కోటంరెడ్డికి అండగా నిలిచింది.
అంటే.. పరోక్షంగా టీడీపీకి దన్నుగా మారుతున్న సంకేతాలు వస్తున్నాయి. అదేసమయంలో దివంగత మేకపాటి గౌతం రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం ఆయన సోదరుడు ప్రస్తుత ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డితో వీరికి లేదు. ఇలా.. సుమారు వంద మంది రెడ్డి నేతలు(వీరు ప్రత్యక్షంగా కనిపించరు) వైసీపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారు. వీరి దన్ను చూసుకునే కోటంరెడ్డి ధైర్యంగా బయటకు వచ్చారనే టాక్ మీడియాలోనూ వచ్చింది. మొత్తానికి ఈ పరిణామాలను గమనిస్తే.. నెల్లూరు పెద్దారెడ్ల మూడ్ అయితే మారిపోయింది. మరి జగన్ వీరిని తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.
This post was last modified on February 11, 2023 12:48 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…