ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. జగనాసు ర రక్త చరిత్ర
పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని తాజాగా పార్టీ ఆవిష్కరించింది. సీఎం జగన్ సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి.. రాసిన ఈ పుస్తకంలో అనేక సంచలన విషయాలను ప్రస్తావించారు.
ఆది నుంచి ఈ ఘటనలో జరిగిన అనేక విషయాలు సహా.. అనేక మలుపులను కూడా పేర్కొన్నారు. ప్రధానంగా వివేకా హత్య కేసులో ఇటీవల వెలుగు చూసిన పరిణామాల్లో వేళ్లన్నీ సీఎం జగన్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయని పుస్తకంలో వెల్లడించారు. ‘జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం- ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది.
తాడేపల్లి
అండ లేకుండా ఇన్ని నేరాలు.. ఘోరాలు సాధ్యం కాదని పుస్తకంలో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన వేకువ జామున 3 గంటల సమయంలో జరిగిందని.. ఆ సమయంలోనే నవీన్(భారతి పీఏ) ఫోన్ ద్వారా భారతీరెడ్డితో, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్‌రెడ్డి మాట్లాడానని సీబీఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ వివరాలను పుస్తకంలో కళ్లకు కట్టినట్టు వివరించారు.
సీబీఐ చార్జిషీట్, వివేకానందరెడ్డి కుమార్తె సునీత అఫిడవిట్స్, వైయస్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వైఎస్ షర్మిల, సునీతారెడ్డి వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం తదితర అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు. మొత్తానికి సీబీఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం సంచలనంగా మారింది.
This post was last modified on February 10, 2023 6:28 pm
కోలీవుడ్‌లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…