ఏప్రిల్ టార్గెట్! ఆ తర్వాత.. అనేక మార్పులు అనూహ్య మార్పులు ఖాయం! తాడేపల్లి వర్గాల్లో జోరుగా జరు గుతున్న చర్చ ఇదే! ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విధంగా ఉన్న వైసీపీ రాజకీయాలు మరోసారి యూటర్న్‌తీసుకునేలా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం విశాఖను పాలనారాజధాని చేయాలనే తపన తో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం లేదని కూడా తేల్చి చెప్పిం ది. అయితే.. ఇది సుప్రీంకోర్టు ఇచ్చే అంతిమ తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది.
వాస్తవానికి మార్చిలోనే విశాఖకు వెళ్లిపోవాలని అనుకున్నా.. అది సాధ్యం అయ్యేలా లేదు. దీంతో క్యాంపు కార్యాలయాన్ని తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇది కూడా ఉగాది తర్వాతే జరగనుందని అంటున్నారు. ఉగాది మార్చి 22న వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాతే.. ప్రభుత్వం అడుగులు వేయడం ఖా యంగా కనిపిస్తోంది. అదే సయమంలో క్యాంపు కార్యాలయాన్ని కూడా ఉగాది తర్వాతే తరలించే ప్రయ త్నం చేస్తున్నారు.
ఇక, రాష్ట్ర మంత్రివర్గంపై సీఎం జగన్ ఒకింత అసహనంగా ఉన్నారు. ఎవరూ యాక్టివ్‌గా పని చేయడం లే దనేది ఆయన తరచుగా చెబుతున్న మాట. దీనికి తోడు కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు బాహా టంగానే వినిపిస్తున్నాయి. మరికొందరు భూముల ఆక్రమణ కేసుల్లో ఉన్నారు. ఇంకొందరు పనితప్ప.. అ న్నీ చేస్తున్నారు. దీంతో మరోసారి ప్రక్షాళన చేసే దిశగా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీని ప్రకారం.. కొత్త ముఖాలను లేపేసి.. మరోసారి తొలి కేబినెట్‌లో పనిచేసిన వారిలోమెజారిటీ భాగం తీసు కుని .. మిగిలిన వారితో మరోసారి కేబినెట్‌ను రీషఫెల్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఇది కూ డా ఉగాది తర్వాతే జరుగుతుందని తెలుస్తోంది. ఇక, సలహాదారుల విషయానికి వస్తే.. లెక్కకు మిక్కిలిగా ఉన్న వీరిని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారని సమాచారం. ఏదేమైనా ఏప్రిల్ తర్వాత.. అనూహ్యమైన మార్పుల దిశగా వైసీపీ అధినేత జగన్ చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
This post was last modified on February 10, 2023 6:26 pm
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…