అధికారంలో ఉన్న వారి సేవలో తరించటం సిబ్బందికి మామూలే. కానీ.. మోతాదు మించిన రీతిలో ఉండే ఈ తీరుతో వచ్చే విమర్శలు భారీగా ఉంటాయి. తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న టూరిజం శాఖకు చెందిన ఉద్యోగులు ప్రదర్శించిన విధేయత ఆమెకు కొత్త కష్టాన్ని తీసుకొచ్చేలా చేసింది.
టూరిజం శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను సందర్శించారు. ఆ బీచ్ రూపురేఖలు మారుస్తామని.. అక్కడ భారీఎత్తున పథకాల రూపకల్పన చేయనున్నట్లుగా చెప్పటమే కాదు.. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని వ్యాఖ్యానించారు. సూర్యలంక బీచ్ ను చూసినంతనే.. దాని అందానికి ముగ్దురాలైన రోజా.. చెప్పులు వదిలి సముద్రం ఒడ్డున నీళ్లలోకి వెళ్లారు.
మంత్రి రోజా చెప్పులు వదిలారో లేదో.. ఆమె చెప్పులకు ఏమవుతుందో అన్నట్లుగా టూరిజం శాఖకు చెందిన సిబ్బందిలో ఒకరు ఆమె చెప్పుల్ని పట్టుకోవటం వివాదానికి కారణమైంది. మంత్రి గారు సముద్రం ఒడ్డున ఉన్న నీటిలోకి వెళ్లి.. కాస్తంత సరదాగా కాలం గడిపి.. మళ్లీ తిరిగి వచ్చే వరకు టూరిజం శాఖకు చెందిన ఉద్యోగి చెప్పుల్నిజాగ్రత్తగా పట్టుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తిరిగి వచ్చిన మంత్రివారికి.. సదరు ఉద్యోగి చెప్పులు ఇవ్వటం.. మేడం వాటిని ధరించి ఇతర కార్యక్రమాలకు హాజరు కావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడం రోజా చెప్పులంటే మాటలా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 10, 2023 10:31 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…