తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. చూచాయగా.. ఒక కీలక విషయాన్ని మంత్రులకి చెప్పేసినట్టు ప్రగతి భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నా యి. ముందస్తుకు వెళ్లిపోదామని.. కేసీఆర్ చెప్పినట్టు కీలక మంత్రికి సంబంధించిన పీఏ ఒకరు మీడియాకు లీకు చేసినట్టు సమాచారం. ఈ ప్రకటన ఈ నెల 17న జరగనున్న సచివాలయ ప్రారంబోత్సవం, అనంతరం సికింద్రాబాద్ లో నిర్వహించే బీఆర్ ఎస్ మూడో విడత సమావేశంలో ఉంటుందని అంటున్నారు.
అంటే.. అసెంబ్లీని రద్దు చేయనున్నట్టు కేసీఆర్ మంత్రులకు ఇప్పటికే చెప్పేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన సభను మొత్తాన్ని కూడా కేటీఆర్‌కు అప్పగించేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని.. విశ్లేషకులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబరు వరకు ప్రభుత్వానికి గడువు ఉన్నప్పటికీ.. అప్పటి వరకు వేచి చూస్తే.. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా పుంజుకునే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ తలపోస్తున్నారు.
వాటికి అవకాశం ఇచ్చే బదులు.. తనే అవకాశంగా మార్చుకుని..ఇ ప్పటికిప్పుడు సభను రద్దు చేసుకుని.. మేలో నే ఎన్నికలకు వెళ్లిపోతే.. తిరుగులేని శక్తిగా అవతరించేందుకు ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సీఎం కేసీఆర్‌ను కలవడం వెనుక ఇదే వ్యూహం ఉందని భావిస్తున్నారు. జగ్గారెడ్డిని స్వయంగా కేసీఆర్ పిలిపించుకున్నారని.. రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక, మరోవైపు.. మే నాటికి తెలంగాణ ఎన్నికలు పూర్తి చేసుకుంటే.. తన చేతిలో దాదాపు 10 మాసాల సమయం ఉంటుంది. ఈ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవసరమైన సరంజామాను రెడీ చేసుకునే అవకాశం ఉంటుందని.. తెలంగాణ ఎన్నికలకు ఎక్కువ సమయం వెచ్చిస్తే.. ఇబ్బంది తప్పదని కూడా కేసీఆర్ ఒక అంచనాకు వచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసిన నేపథ్యంలో దీనినే ఎన్నికల అస్త్రంగా మార్చుకుని.. ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తారని.. కేటీఆర్‌కు పగ్గాలు అప్పగించేస్తారని.. ఈ రెండు ప్రకటనలు అంటే.. అసెంబ్లీ రద్దు, బీఆర్ ఎస్ రాష్ట్ర చీఫ్‌గా కేటీఆర్ ప్రకటన రెండూ కూడా.. ఈనెల 17నే జరిగిపోతాయని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 10, 2023 10:25 am
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…