Political News

బాబు మాట్లాడితే త‌ప్పు.. జ‌గ‌న్ మాట్లాడితే ఒప్పా.. స‌జ్జ‌ల స‌ర్‌!!

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై ప్రెస్‌మీట్ పెట్టి సీఎం జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కార‌మే తాము అమ‌రావ‌తిని ఏర్పాటు చేశామ‌ని.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా వ‌చ్చి శంకుస్థాప‌న కూడా చేశార‌ని.. అలాంటి దానిని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని.. ఆయ‌న జ‌గ‌న్‌ పై విరుచుకుప‌డ్డారు. అంతే కాదు.. ఇక్క‌డి ర‌హ‌దారుల‌ను కూడా త‌వ్వేస్తున్నార‌ని అన్నారు.

అయితే.. దీనిపై తాజాగా కౌంట‌ర్ ఇచ్చిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం రాజధాని అంశంపై అఫిడవిట్ వేసిందని, ప్ర‌స్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు ప‌రిధిలో ఉన్నందున చంద్ర‌బాబు అలా మాట్లాడ‌డం న్యాయ‌మేనా? అని ప్ర‌శ్నించారు. మ‌రి ఇదే సూత్రం సీఎం జ‌గ‌న్‌కు ఎందుకు వ‌ర్తించ‌ద‌ని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కొన్ని రోజుల కిందట సీఎం జ‌గ‌న్ రాజ‌ధాని త్వ‌ర‌లోనే విశాఖ‌కు వెళ్లిపోతుంద‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని వారు గుర్తు చేశారు.

త‌మ‌కు ఒక న్యాయం.. సీఎం జ‌గ‌న్‌కు ఒక న్యాయం ఉంటుందా? అని ఎదురుదాడి చేశారు. ఇదిలావుంటే.. సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి తాము గుర్తించిన రాజధాని అని కేంద్రం అనకపోయినా చంద్ర‌బాబు అండ్ కోలు దుష్ప్రచారం.. రాద్ధాంతం చేస్తున్నారని విరుచుకుప‌డ్డారు. చంద్రబాబు దీనిని అడ్డు పెట్టుకుని సీఎం జ‌గ‌న్‌ పై తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు తన స్థాయి మరచిపోయి మాట్లాడారని విమ‌ర్శించారు.

జగన్ అప్ప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వ భూమి ఎక్కువగా రాజధానికి ఉండాలని చెప్పారని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో చాలా స్పష్టంగా ఉందన్నారు. పునర్విభజన చట్టంలో చెప్పిన ప్రకారమే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని కేంద్రం ఇచ్చిన అఫిడ‌విట్‌ను సజ్జ‌ల స‌మ‌ర్థించుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతూ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. రాజధానిని చంద్రబాబు బంగారు బాతుగా భావించారని మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on February 10, 2023 7:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

9 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

11 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

12 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

13 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

13 hours ago