తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ‘హాత్ సే హాత్ జోడో’ అంటూ మొదలుపెట్టిన పాదయాత్రకు సీనియర్ల నుంచి సహకారం కొరవడింది. రేవంత్ యాత్రలో సీనియర్లు కనిపించడం లేదు. యాత్ర ప్రారంభమైన తరువాత మల్లు రవి తప్ప వేరే సీనియర్ నేతలెవరూ రేవంత్ పాదయాత్ర వైపు కన్నెత్తి చూడలేదు.
అయితే, పాదయాత్ర ముగిసేలోపు ఒక్కరొక్కరుగా జాయిన్ అవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నా సీనియర్ నేతలు మాత్రం అందుకు ఏమాత్రం సుముఖంగా లేరు. కొందరు ప్రస్తుతానికి సాకులు చెప్తుండగా మరికొందరు నేతలు ఏకంగా తాము అసలు ఆయన పాదయాత్రకు వెళ్లబోమని కుండబద్ధలు కొడుతున్నారు.
మరికొందరు నేతలు తెలంగాణలో బడ్జెట్ సమావేశాలను, ఇంకొందరు పార్లమెంటు సమావేశాలను సాకుగా చూపించి తప్పించుకుంటున్నారు. అయితే, ఈ వారంతో పార్లమెంటు సమావేశాలు ముగియనుండడంతో లోక్ సభలో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు ఆ తరువాత ఏం చెప్తారో చూడాలి.
రేవంత్ పాదయాత్ర వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి వంటివారు ఎవరూ చూడడం లేదు. లోక్ సభ సమావేశాలు జరుగుతున్నందున తాను ప్రస్తుతం పాదయాత్రలో చేరలేనని చెప్పారు. ఇంకొందరు నాయకులు తెలంగాణ బడ్జెట్ సమావేశాలను కారణంగా చెప్పారు.
అవసరమైతే తాను పాదయాత్ర చేస్తాను కానీ రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనేదే లేదని మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. ఇక జగ్గారెడ్డి అయితే పాదయాత్ర సంగారెడ్డిలోకి వచ్చినా కూడా తాను రేవంత్‌ను కలవబోనని అన్నారు.
వాస్తవానికి పీసీసీ చీఫ్, సీనియర్ నేతల మధ్య గ్యాప్ తొలగించడానికి పార్టీ అధిష్ఠానం అన్ని ప్రయత్నాలూ చేసింది. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా గతంలో ఉన్న మాణిక్కం ఠాగోర్ పూర్తిగా రేవంత్ కు అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగించి మాణిక్ రావు థాక్రేకు బాధ్యతలు అప్పగించారు. మాణిక్ రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుస సమావేశాలు జరిపారు. అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. దీంతో కొందరు నేతలు ఆయన మాట వింటామన్నారు.
కానీ రేవంత్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎవరూ వెంట రాలేదు. దీంతో జనం ఎంత పెద్దసంఖ్యలో వస్తున్నా రాష్ట్రస్థాయి నేతలు వెంట లేకపోవడం రేవంత్ పాదయాత్రలో లోటుగా కనిపిస్తోంది.
అయితే, రేవంత్ మాత్ర ఇదంతా ఊహించినట్లుగానే కనిపిస్తున్నారు. సీనియర్ల నుంచి సహాయం అందదన్న విషయం స్పష్టంగా తెలిసిన ఆయన క్యాడర్‌ను, తన వర్గం నేతలను చురుగ్గా మార్చి యాత్ర సక్సెస్ చేసే యోచనలో ఉన్నారు.
This post was last modified on February 8, 2023 10:05 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…