ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న మూడు రాజధానుల ఆశలపై కేంద్రం కుదరదని పరోక్షంగా కుండబద్దలు కొట్టి మరీ చెప్పేసింది. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ విజభన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్రం ఏం చెప్పిందంటే..
— ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 లతో రాజధాని అమరావతి ఏర్పాటు అయ్యింది.
— దీంతో రాజధానిని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఏపీకి లేదు.
— మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు.
— జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం చేసిన చట్టాలతో కేంద్రానికి సంబంధం లేదు.
— అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించాం.
— అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసింది.
— ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది.
— దీనిపై ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుంది.
— ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5, 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నూతన రాజధాని నిర్మాణం అధ్యయనానికి ఏర్పాటు చేసింది.
— అధ్యయన నివేదికను తదుపరి చర్యలు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించాం.
— ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది.
— 2020లో మూడు రాజధానుల బిల్లును తీసుకువచ్చారు.
— మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే ముందు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు.
— రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
This post was last modified on February 8, 2023 6:42 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…