Political News

‘కేంద్రం’ వ‌ద్ద‌కు నెల్లూరు పంచాయ‌తీ!

నెల్లూరు వైసీపీలో చోటు చేసుకున్న వివాదం.. ఇప్పుడు కేంద్రం వ‌ద్ద‌కు చేరింది. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి.. గ‌త వారం రోజుల్లో జ‌రిగిన ప‌రిణామాల‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. త‌న ఫోన్‌ను ట్యాప్ చేశార‌ని..దీని పై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న కోరారు. త‌న ఫోన్ ట్యాప్ చేసిన విష‌యాన్ని ఇద్ద‌రు ఐపీఎస్ అధికారులు త‌న‌కు చెప్పార‌ని.. తాను అధికార పార్టీ నేత‌గా ఉన్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్ర‌భుత్వ‌మే ఉంద‌ని తాను అనుమానిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను కూడా కోటంరెడ్డి దీనికి జ‌త చేశారు. నిష్ఫాక్షిక విచార‌ణ జ‌రిపించేలా ఆదేశించాల‌ని కోరారు. అదే స‌మ‌యంలో త‌న‌కు కొన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న భ‌ద్ర‌త‌ను కుదించింద‌ని 2+2గా ఉన్న త‌న భ‌ద్ర‌త‌ను 1+1గా కుదించింద‌ని.. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చేలా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని సూచించారు.

త‌ను ఫోన్ మాట్లాడాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితిని క‌ల్పించార‌ని.. కొంద‌రు చేస్తున్న ఈ వ్య‌వ‌హారంపై కేంద్రం దృష్టి పెట్టాల‌ని సూచించారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. ఈ మేర‌కు కోటంరెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. దీనిపై న్యాయ విచార‌ణ‌కు ఆదేశించినా.. తాను అన్ని విధాలా స‌హ‌క‌రిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కాగా, ప్ర‌స్తుతం కోటంరెడ్డి రాసిన లేఖ రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. ఆ వెంటనే ఆయ‌న‌న నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా తొల‌గించ‌డం.. నెల్లూరు రూర‌ల్ బాధ్య‌త‌ల‌ను ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డికి అప్ప‌గించ‌డం వంటివి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న నేరుగా కేంద్రం త‌లుపు త‌ట్ట‌డం వివాదాన్ని మ‌రింత పెంచేలా క‌నిపిస్తోంద‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.

This post was last modified on February 8, 2023 6:38 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

4 mins ago

గోదావరి తీరంలో ‘గ్యాంగ్’ సమరం

https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…

2 hours ago

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

2 hours ago

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

4 hours ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

4 hours ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

4 hours ago