ఆయన వైసీపీ యువ ఎంపీ. తరచుగా.. సమస్యలపైనా గళం వినిపిస్తున్నారు. పైగా ఎలాంటి అవినీతి, అక్రమాల మాట కూడా ఆయనకు కిట్టదు. ఆయనే గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు. గత 2019 ఎన్నికల సమయంలో వైసీపీలోకి వచ్చిన ఆయన తొలి ప్రయత్నంలోనే విజయం దక్కించుకున్నారు. మంచి నాలెడ్జ్.. ఉన్నత విద్యావంతుడు కూడా అయిన లావుకు ప్రజల్లో మంచి పేరుంది.
అయితే.. ఎంత మంచి పేరున్నా.. వైసీపీలో ఇప్పుడు ఆయనకు టికెట్ దక్కేనా? అనే సందేహాలు ముసు రుకున్నాయి. దీనికి కారణం.. సొంత పార్టీలో నేతలతో ఉన్న విభేదాలు.. మరోవైపు అమరావతి రాజధానిని పార్టీలో ప్రతి ఒక్కరూ విభేదిస్తుండగా.. లావు మాత్రం నేరుగా అమరావతి రైతుల శిబిరాల వద్దకు వెళ్లి వారిని ప్రోత్సహించారనే వాదన పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను కొన్నాళ్లుగా పక్కన పెడుతూ వచ్చారు.
అయితే.. ఇప్పుడు రాజకీయంగా మరో వాదన కూడా తెరమీదికి వచ్చింది. ఇటీవల లావు.. టీడీపీతో టచ్‌లో కి వెళ్లారని.. ఆయన వ్యవహారంపై చర్చించాలని.. కొందరు ఎమ్మెల్యేలు.. లావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన ఎంపీ లావు.. తను ఎవరికీ టచ్‌లోకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. అయితే.. లావు ఎన్ని చెప్పినా ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే విషయాన్ని పార్టీ పక్కన పెట్టిందా? ఇస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. నరసరావుపేట టికెట్‌కు వేణుగోపాల్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఎంపీ లావుకు ఎక్కడ అవకాశం కల్పిస్తారు? అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఈ విషయంపై చాలా వ్యూహాత్మక మౌనంగా ఉండడం గమనార్హం. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 8, 2023 2:37 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…