చూడు.. ఒక్కవైపే చూడు.. అన్న సినిమా డైలాగు ఏపీలో బాగానే పనిచేస్తోందని అంటున్నారు పరిశీలకు లు. ఏపీలో ఇప్పుడు ఎటు చూసినా.. ఈ డైలాగే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఏ మూల చూసినా… జగన్ జపమే. ఎటు వైపు తిరిగినా.. జగన్ నామస్మరణే వినిపిస్తోంది. ఆయన ఫోటోలే కనిపిస్తున్నాయి. దీంతో జగన్..మాత్రమే కనిపించాలి.. జగన్ పేరు మాత్రమే వినిపించాలి.. జగన్ గురించే చర్చించాలి.. అనే విధంగా పరిస్థితి మారిపోయింది.
రాజకీయాలైనా ప్రభుత్వ విభాగాలైనా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంపార్టెంటే. కానీ, అదేసమయంలో క్షేత్రస్థాయి నాయకులు.. అదేవిధంగా ఆయా ప్రభుత్వ విభాగాల హెడ్స్ కూడా ముఖ్యమే. దీంతో వారు కూడా తమకు గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పార్టీ కార్యాలయాల్లో అయితే.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, లేదా ఎంపీల ఫొటోలను పెట్టుకుంటారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు అయితే.. ముఖ్యమంత్రి ఫొటోతోపాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లేదా.. డీజీపీ ఫొటోలు ఏర్పాటు చేసుకుంటారు. ఇది సహజం కూడా. ఇక, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైతే.. ప్రధాని ఫొటోలు ఉంటాయి. ఇది రివాజు కూడా. అయితే.. ఏపీలో పరిస్థితి మారిపోయింది.రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలైతే.. కేవలం సీఎం జగన్ ఫొటో తప్ప ఇంకేమీ కనిపించరాదనే ఉత్తర్వులు మౌఖికంగా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
అదేసమయంలో పార్టీ కార్యాలయాల్లోనూ.. జగన్ ఫ్రేము మాత్రమే కనిపించేలా ఏర్పాటు చేయాలని.. కూడా పార్టీ తరఫున కీలకసలహాదారు ఆదేశాలు ఇచ్చారని.. పార్టీలో చర్చ సాగుతోంది. అయితే.. పార్టీ కార్యా లయాలకు ఖర్చు పెట్టేది.. సొంత పార్టీ నేతలేనని.. వారి ఫొటో పెట్టుకుంటే తప్పులేదని ఒక వాదన తెర మీదికి వచ్చింది.
ఈనేపథ్యంలో ఇలాంటి నేతల ఫొటోలను పెట్టుకోవచ్చని.. కానీ, సీఎం జగన్ ఫొటో సైజు మాత్రం పెద్దదిగా ఉండాలని ఆదేశించారట. అంటే.. ఇక.. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా.. జగన్ మాత్రమే కనిపిస్తారన్న మాట. ఇదీ.. సంగతి!!
This post was last modified on February 8, 2023 11:28 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…