సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. పార్టీలో ఎవరినీ లెక్కచేయరు. అందరినీ కలుపుకుపోవాలనే కోరిక లేని నాయకుడు. ఆయనదీ అంతా ఒంటెత్తు పోకడే. కన్నా లక్ష్మీ నారాయణ హయాంలో పెట్టిన జిల్లా అధ్యక్షు లను మార్చేసి ఇటీవలే ఒక వివాదానికి ఆయన కేంద్ర బిందువయ్యారు. ఆయన ఏం మాట్లాడిన పెద్ద వివాదమై కూర్చుంటున్న తరుణంలో ఇప్పుడు ఓ క్రేజీ డైలాగ్ వదిలారు..
ప్రత్యేక హోదా ఇచ్చేశాం…
వీర్రాజు లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేసింది. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు హయాంలోనే కేంద్ర ప్రభుత్వం , ఏపీకి హోదా ఇచ్చేసిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. పైగా హోదాలో భాగంగా పార్లమెంటు సాక్షిగా 15వేల కోట్లు ఇచ్చామన్నారు. ఇంకొన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు..పైగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని తాను చెప్పనంటున్నారు. 2014లో అధికారానికి వచ్చిన చంద్రబాబు హయాంలోనే హోదా ఇచ్చినప్పుడు ఇక అది ముగిసిన అధ్యాయమని చెప్పడం కుదరదన్నారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ వారికే దిమ్మ తిరిగేవిగా ఉన్నాయి. విభజనం సమయంలో ఐదు కాదు పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరిన బీజేపీ నేతలు… మోదీ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. హోదా ఇవ్వడం మోదికి ఇష్టం లేదని తెలుసుకుని మాట మార్చారు. హోదా కంటే ఎక్కువ నిధులను ఏపీకి కేటాయించామని, అన్ని డిమాండ్లను నేరవేర్చుతున్నప్పుడు ఇక హోదా మాట ఎందుకని ప్రశ్నించారు. హోదా ఒక ముగిసిపోయిన అధ్యాయమని పలువురు బీజేపీ జాతీయ నేతలు చెబుతూనే ఉన్నారు. మరి వీర్రాజు తాజా ప్రకటనపై వారి స్పందన ఏమిటో చూడాలి….
This post was last modified on February 7, 2023 10:42 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…