కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం సమయం ఉండటంతో ఇప్పుడది ఎన్నికల అంశంగా మారుతోంది. మాజీ మంత్రి, కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఏపీ హైకోర్టులో ఈ మేరకు ఒక రిట్ పిటిషన్ వేశారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈ పిటిషన్ దాఖలైంది.
ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు హయాంలో చట్టాలు చేశారు. జగన్ అధికారానికి రాగానే ఆ చట్టాలను రద్దు చేశారు. రెండు జీవోలతో ఆ రిజర్వేషన్ మొత్తాన్ని జగన్ సర్కారు నిలుపుదల చేసింది. దీనితో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయిన కాపు వర్గాలు తీవ్ర ఆందోళన, ఆవేదనకు లోనయ్యారు. కాపు, బలిజ, తెలగ వర్గాలు మళ్లీ వెనుకబాటు తనంలోకి వెళ్లిపోతాయన్న భయం వారిలో నెలకొంది.
జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల హరిరామ జోగయ్యను కలిశారు. అప్పుడు కాపు రిజర్వేషన్ అంశం, జగన్ చేసిన ద్రోహం చర్చకు వచ్చింది. కేవలం కక్షసాధింపుతో జగన్, కాపు రిజర్వేషన్‌ను ఆపేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ స్థానం ద్వారా రిజర్వేషన్‌ను సాధించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి చర్చల ఆధారంగానే కాపు వర్గాలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాయి. ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిజానికి కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాల్లో చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారు. వారికి తిండి కూడా దొరకడం లేదు. ఆ సంగతిని కోర్టులో నిరూపించగలిగితే, సరైనా గణాంకాలు సమర్థించగలిగితే అనుకూల తీర్పు వస్తుందని ఎదురుచూస్తున్నారు.
This post was last modified on February 7, 2023 7:41 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…