వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జనసేన అనేది అసలు పార్టీనే కాదని.. దానికి పవన్ అధ్యక్షుడు కూడా కాదని.. అసలు ఆ పార్టీలేదని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. టీడీపీ జెండా మోస్తూ.. చంద్రబాబు దగ్గర కూలి పనిచేస్తున్న ఆ పార్టీ సీనియర్ కార్యకర్త మాత్రమేనని చెప్పుకొచ్చారు.
అయితే.. మంత్రి గుడివాడ కామెంట్లపై తాజాగా మా ఎంపీ, కాపుసేన సంక్షమం నాయకుడు రామజోగయ్య సంచలన కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాలసిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్తుని పాడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా అంటూ జోగయ్య పేర్కొన్నారు.
గతంలోనూ గుడివాడ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో జోగయ్య స్పందించారు. ఇటీవల ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు. అయితే.. ఇప్పుడు అసలు రియాక్షన్ రావాల్సింది కాపుల నుంచే. ఎందుకంటే.. పవన్‌ను నమ్ముతున్న, నమ్ముకుంటున్న కాపులను మంత్రి గుడివాడ టార్గెట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన అడుగడుగునా.. ప్రతి పదం వెనుక కూడా కాపులు పవన్‌ను నమ్మొద్దు! అని వ్యాఖ్యలు. కానీ, కాపు నేతలు ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. మరి మున్ముందు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on February 5, 2023 6:11 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…