వైసీపీ నేతలకు..టీడీపీ నేతలకు ఎంత దూరం అంటే.. చాలా చాలా దూరమేనని చెప్పాలి. పైగా ఒకరు ఉత్తరం అయితే.. మరొకరు దక్షిణం కూడా.. రెండు పార్టీ లనాయకులు ఎదురు పడే సందర్భాలు కూడా చాలా అరుదు. అంతేకాదు.. ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకుంటున్న పరిస్థితి పెరిగిపోయింది. అయితే.. అలాంటి సమయంలో ఏకంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రయాణించారు వైసీపీ నేత ఒకరు.
ఇది యాదృచ్ఛికంగానే జరిగింది. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లే ఒక విమానంలో చంద్రబాబు ప్రయాణించారు. అయితే.. అనూహ్యంగా ఇదే విమానంలో వైసీపీ నాయకుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి కూడా ప్రయాణించారు. అంతేకాదు.. విమానాశ్రయ సిబ్బంది ఇద్దరికీ కూడా పక్కపక్కనే సీట్లు కేటాయించడంతో చంద్రబాబు పక్కనే మీరా కూడా కూర్చొని ప్రయాణించారు.
అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఆయన పిచ్చాపాటీ మాటలు కలిపారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని గురించిన చర్చ జరిగింది. ఎందుకంటే.. వైసీపీ నాయకుడు మీరా ఈ ప్రాంతానికిచెందిన వారే. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలియడంతో చంద్రబాబు అమరావతి గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసి ఉన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన మీరా వలి.. తాను వైసీపీ నాయకుడినేనని.. అయినప్పటికీ చంద్రబాబు విజన్‌కు మాత్రం ఫిదా అవుతానని చెప్పారు. అంతేకాదు.. అమరావతి డెవలప్ కావాలంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని మీరా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
This post was last modified on February 4, 2023 10:36 pm
తమిళ సీనియర్ నటి ఖుష్బు.. తన తండ్రి నుంచే తాను చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న షాకింగ్ విషయాన్ని గతంలోనే…
ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఎక్కడ చూసినా హెల్త్ పట్ల అవగాహన విపరీతంగా పెరుగుతుంది. చాలామంది…
ఇప్పుడు ఇండియన్ సినిమాలో తెలుగు చిత్రాలదే హవా. మొత్తంగా సక్సెస్ రేట్ గొప్పగా లేకపోయినా.. మన దగ్గర్నుంచి వస్తున్న కొన్ని…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అల్లు…
భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది నవంబరు 29న విశాఖలో పర్యటించాల్సి ఉండగా..తుపాను హెచ్చరికల నేపథ్యంలో అది రద్దయ్యింది.…
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. తన తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’…