క్రికెట్ లో టెస్టు మ్యాచ్ లు నత్తనడకన ఐదురోజులపాటు సాగుతూ చాలా విసుగు తెప్పిస్తుంటాయి. కరుడుగట్టిన క్రికెట్ అభిమానులకూ విసుగు తెప్పించే టెస్టు మ్యాచ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇక, ఐదో రోజు ఫలితం డ్రా అని తెలిసిన టెస్టు మ్యాచ్ లపై ఎంత మాత్రం ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవరసరం లేదు. అటువంటి డ్రా కాబోతోందని తెలిసిన బోరింగ్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నా….ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరు. డ్రా కాబోయే మ్యాచ్ లో ప్రత్యర్థులు బౌన్సర్లు విసిరినా..గూగ్లీలు వేసినా… డిఫెన్స్ ఆడడం మినహా దూకుడుగా ఆడి వికెట్ పోగొట్టుకోవాలని ఎవరూ అనుకోరు. ఈ తరహా బోరింగ్ టెస్టు మ్యాచ్ లాగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా డ్రా కాబోతోన్న బోరింగ్ పొలిటికల్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత కొద్ది నెలలలుగా ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు సూచనల ప్రకారం గవర్నర్ బిశ్వభూషణ్ ను రమేశ్ కుమార్ కలిశారు. తనను ఎస్ ఈసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వకపోవడంతో.. పాత స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా గవర్నర్ కు నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు. నిమ్మగడ్డ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్…. ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించాల్సిందిగా జగన్ సర్కార్‌కు సూచించారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. నిమ్మగడ్డ విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. ఒక వేళ గవర్నర్ ఆదేశాలతో నిమ్మగడ్డను ఏపీ సర్కార్ తిరిగి నియమిస్తే… 2021 మార్చి వరకూ…అంటే మరో 8 నెలలపాటు నిమ్మగడ్డ ఏపీ ఎస్ ఈసీ పదవిలో కొనసాగుతారు.
మరోవైపు, ఏపీ ఎస్ ఈసీనని చెప్పుకుంటున్న నిమ్మగడ్డ తీరు సరిగా లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని చెప్పుకునే నిమ్మగడ్డ.. హోటళ్లలో రాజకీయ నేతలతో మంతనాలు జరుపుతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఎస్‌ఈసీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి దానిని గౌరవించాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రవర్తించడం లేదని తెలిపారు.
అయితే, ఏపీ ఎస్ ఈసీగా నిమ్మగడ్డను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఒక వేళ నిమ్మగడ్డకు మరే అడ్డంకులు ఎదురు కాకుంటే…మరో 8 నెలల పాటు నిమ్మగడ్డ ఏపీ ఎస్ ఈసీగా కొనసాగుతారు. అంటే మరో 8 నెలలపాటు క్రికెట్ లో ది వాల్
అని పేరుమోసిన రాహుల్ ద్రావిడ్ లా నిమ్మగడ్డ సాలిడ్ డిఫెన్స్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. వైసీపీ సర్కార్ సంధించబోయే బౌన్సర్లు, గూగ్లీలను నిమ్మగడ్డ ఫేస్ చేయాల్సి రావచ్చు. కరోనా పుణ్యమా అంటూ రాబోయే 8 నెలల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితులు లేని నేపథ్యంలో నిమ్మగడ్డ డిఫెన్స్ మోడ్ లో బ్యాటింగ్ చేయక తప్పని పరిస్థితులు ఏర్పడే అవకాశముందని చెప్పవచ్చు.
ఇప్పటికే జగన్ సర్కార్ పై ఫ్యాక్షన్ ప్రభుత్వం అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన నిమ్మగడ్డకు ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం ఉండకపోవచ్చు. బీజేపీ నేతలతో నిమ్మగడ్డ సమావేశం నిర్వహించడంతో వైసీపీ నేతలు ఇంకా గుర్రుగా ఉన్నారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మినహా ఎస్ ఈసీకి మిగతా టైంలో పెద్దగా ప్రభుత్వంతో పని ఉండదు. నిమ్మగడ్డ ఏ కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేశారో….అదే కరోనా వల్ల ఏపీలో మరో 8 నెలలపాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ అనుకోరు. ఒకవేళ నిమ్మగడ్డ అనుకున్నా అందుకు ప్రభుత్వం కరోనా పరిస్థితుల దృష్ట్యా అంగీకరించకపోవచ్చు. కరోనా వ్యవహారం సద్దుమణిగా సాధారణ పరిస్థితులు వచ్చేనాటికి…నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసే అవకాశాలే ఎక్కువ. అంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా నిమ్మగడ్డ ఆధ్వర్యంలో జరగకపోవచ్చు. ఈ లోపు ఏపీ ఎస్ ఈసీ హోదాలో…గత ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల వంటి వాటికి ప్రభుత్వం నుంచి ప్రతి స్పందన పెద్దగా ఉండకపోవచ్చు.
తమ ఇమేజ్ ను డ్యామేజీ చేసిన నిమ్మగడ్డకు ప్రభుత్వం అంతగా సహకరించకపోవచ్చు. తమతో వైరం పెట్టుకున్న నిమ్మగడ్డపై….జగన్ సర్కార్ పొలిటికల్ బౌన్సర్లు, గూగ్లీలు సంధించే అవకాశం ఉంది. దాదాపుగా నిమ్మగడ్డ పదవీ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి….ఈ సమయంలో ఆ బౌన్సర్లు, గూగ్లీలకు నిమ్మగడ్డ సాలిడ్ డిఫెన్స్ పెట్టడం తప్ప చేసేదేమీ ఉండకపోవచ్చు. కాబట్టి, రాబోయే 8 నెలల్లో నిమ్మగడ్డ విజయవాడలో ఏపీ ఎస్ ఈసీగా నామ్ కా వాస్తే పదవీకాలాన్ని వెళ్లదీసి వెళ్లిపోవాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ముందు ముందు నిమ్మగడ్డ వ్యవమారం ఏ మలుపు తీసుకుంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.
This post was last modified on July 23, 2020 10:20 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…