నెల్లూరు రూరల్ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనసులో మాట చేప్పేశారు. అధికార వైసీపీలో ఉండదలచుకోలేదని నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మౌనంగా తప్పుకోదలచుకున్నానని వెల్లడించారు.భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు. కొంతకాలంగా ఆయన పార్టీ పట్ల, జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక ప్రకటనలిస్తున్నారు. కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి మాట్లాడినా ఆయన మెత్తబడలేదు. అన్ని విషయాలు మాట్లాడుకుందామన్నా.. వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారు. నాదారి రహదారి అని చెబుతూ ఇక బై బై అనేశారు. మనసు ఒక చోట, శరీరం ఒక చోట ఉండటం తనకు చేతకాదని చెప్పుకున్నారు. తన రాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్నారు. తనను సంజాయిషీ అడగ కుండానే చర్యలు చేపట్టారన్నారు. ట్యాపింగ్ పై సాక్ష్యాధారాలు కూడా మీడియా ముందుంచారు…
ఐపీఎస్, ఐఏఎస్, జడ్జిలు, ఎమ్మెల్యేలపై ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని కోటంరెడ్డి అన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులు తనకు ఫోన్ చేసి మాట్లాడారని కోటంరెడ్డి వెల్లడించారు. పైగా తాను , తన మిత్రుడు మాట్లాడిన ఆడియోను సీతారామంజనేయులు తనకే పంపారని కోటంరెడ్డి చెప్పారు. ఆ ఆడియోను కూడా మీడియాకు అందించారు. తొలుత అనుమానించానని, ఇప్పుడు సాక్ష్యం దొరికిన తర్వాత వైసీపీలో తనపై జరుగుతున్న కుట్ర అర్థమైందని కోటంరెడ్డి అన్నారు. అది ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఏమవుతుందని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఫోన్ నెంబర్ కూడా ఆయన ఇచ్చారు. సజ్జలతో పాటు సీఎం పేషీ అధికారి ధనుంజయ్ రెడ్డి కూడా అందులో భాగస్వామి అని కోటంరెడ్డి ఆరోపించారు.
నాలుగు నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ అవుతుందని చాలా ఆలస్యంగా గ్రహించానన్నారు. అదే సంగతి బాలినేనికి చెప్పానన్నారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లిపోవచ్చని బాలినేని అన్నారని, అది తనకే సంకేతమని కోటంరెడ్డి చెప్పుకున్నారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నానని కోటంరెడ్డి తన అభిప్రాయంగా చెప్పారు. మరో పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. నిజానికి 24 గంటల ముందు ఉదయగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తనను చంపేస్తారేమోనని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత మరెంతమంది బయటకు వస్తారో చూడాలి…
This post was last modified on February 1, 2023 11:06 am
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…