గత 2019 ఎన్నికల్లో వైసీపీ విజృంభించిన విషయం తెలిసిందే. టీడీపీకి కంచుకోటలు వంటి జిల్లాల్లోనూ వైసీపీ ఫ్యాన్ భారీ ఎత్తున వీచింది. ఎవరూ ఊహించని విధంగా.. పార్టీ పుంజుకుంది. ఉభయ గోదావరులు, నెల్లూరు, కర్నూలు, గుంటూరు వంటి జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం చేసుకుని మరీ .. వైసీపీ దూసుకుపోయింది. ఇక, కడపలో క్లీన్ స్వీప్ చేసేసింది. అదేవిధంగా నెల్లూరు , కర్నూలలోనూ విజయం దక్కించుకుంది.
అయితే.. ఇది గతం! కానీ, ఇప్పుడు పరిస్థితి చూస్తే.. భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. టీడీపీకి బలమైన జిల్లాల్లో వైసీపీ బలోపేతం అయిందనే వాదన నుంచి ఇప్పుడు బలహీన పడుతోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వైసీపీ అధిస్టానమే కారణమని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేసే క్రమంలో వేస్తున్న అడుగులు.. సరిగా లేకపోవడం ప్రధాన కారణం.
నిజానికి ఇప్పుడున్న నాయకులకు టికెట్ ఇస్తారో లేదో తెలియదు. పైకి ఇస్తామని అంటున్నా.. చివరి నిముషంలో రాష్ట్రంలో చోటు చేసుకునే పొత్తుల నేపథ్యంలోనే వైసీపీలోనూ టికెట్ల పందేరం ఉంటుంది. కాబట్టి.. వైసీపీ అధిష్టానంపై కొందరు నాయకులు సానుకూలంగా లేకపోవడం.. ఇటీవల కాలంలో తరచుగా కనిపిస్తోంది. అందుకే.. పార్టీ ఒకింత బలంగా ఉందని అనుకుంటున్న నియోజకవర్గాలలోనూ.. ఇప్పుడు ఎదురీత తప్పడం లేదు.
నెల్లూరు జిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లాలో పార్టీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. దీనికి కారణం.. జగన్ సీఎం కావడమే లక్ష్యంగా ఇక్కడి నాయకులు అప్పట్లో కలసి కట్టుగా పనిచేశారు. అయితే.. ఇప్పుడు ఆ పరిస్తితిలేదు. కలసి కట్టుగా కొట్టుకునే పరిస్థితి ఉంది. ఇటీవల వైసీపీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ ..`కొన్ని జిల్లాల్లో మాకు ప్రతిపక్షం అవసరం లేదు.
మాలోనే మాకు దిమ్మతిరిగిపోయే ప్రతిపక్ష నాయకు లు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. సో.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానే ఉంది. మరి చివరకు ఏం చేస్తారో.. పార్టీ పరిస్థితి ఎలాంటి మలుపుతిరుగుతుందో చూడాలి.
This post was last modified on February 1, 2023 9:44 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…