ఏపీ సీఎం జగన్‌కు.. ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉందన్న విషయం తెలిసిం దే. ఇప్పటికే రఘురామ.. సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని ఒకసారి కోర్టులో కేసు వేశారు. ఇక, రఘురామను అరెస్టు చేయించి కొట్టించారనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా సీఎం జగన్ చేసిన కామెంట్లపై రఘురామ రియాక్ట్ అయ్యారు. జగన్ యాక్షన్ అంటే..రఘురామ రియాక్షన్ అన్నారు. దీంతో విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
విషయం ఏంటంటే..
ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాజధానిపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు హుటాహుటిన లేఖ రాశారు. విశాఖ రాజధాని అని ప్రకటించి సీఎం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని లేఖలో తెలిపారు. రాజధానిపై సుప్రీంలో కేసు విచారణలో ఉన్న సమయంలో.. ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని రఘురామ వివరించారు. వీటిపై చర్యలు తీసుకో వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో విన్నవించారు. మరోవైపు, జగన్ విశాఖకు మారితే ఆయన ఇంటి చిరునామా మాత్రమే మారుతుందని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు. రాజధాని మార్పు అనేది అసాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగినా ప్రయోజనం శూన్యమని విమర్శించారు.
కోర్టులు, రాజ్యంగాన్ని జగన్ అపహాస్యం చేశారన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడితే.. ప్రభుత్వాలే కూలిపోయాయని అన్నారు. ఇదిలావుంటే.. ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సదస్సులో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీన నేను విశాఖకు వెళ్తున్నాను.. నాతో పాటు మీరు కూడా విశాఖకు రావాలని పలు దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ వీడియోను రఘురామ తన లేఖకు జత చేశారు.
This post was last modified on February 1, 2023 9:38 am
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…