వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని.. తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. ప్రజల్లో సింపతీ పెరిగిందని.. ఇది ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు కొన్ని వర్గాల మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కూడా నిర్ణయించుకున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతు న్నాయి. నిజానికి గతంలోనే వైసీపీ ప్రభుత్వం అంటే.. 2020లోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టం తెచ్చింది.
అదేసమయంలో సోషల్ మీడియాలోనూ వ్యతిరేక ప్రచారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని కూడా నిర్ణయించుకుంది. అయితే.. సదరు ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక పోయింది. అయినప్పటికీ.. సర్కారుపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిపై ఏదో ఒక కేసును పెడుతూనే ఉన్నారు. 2021-22 మధ్య వందల మందిని అరెస్టు కూడా చేశారు.
అయినప్పటికీ సర్కారుపై వ్యతిరేక ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇటీవల కాలంలో జనసేన, టీడీపీ నేతలు.. మరింత దూకుడుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందనే సంకేతాలు వస్తున్నాయి. అదేసమయంలో ప్రజల మధ్య కూడా సీఎం జగన్ వ్యవహార శైలిపై చర్చ జరుగుతోంది. ఆయన అనుభవం లేని నాయకుడు అని.. కేవలం పంపకాలకు మాత్రమే పరిమితం అవుతారని.. ఓ వర్గం చేస్తున్న ప్రచారం ప్రభావం చూపుతోంది.
మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో ఈ చర్చ జోరుగా సాగుతోం ది. దీంతో వైసీపీ అధిష్టానం ఆత్మరక్షణలో పడింది. ఇప్పుడు ఏం చేస్తే.. ప్రయోజనం ఉంటుందనే విషయంపై మేధావులతో చర్చ లు జరుపుతున్నట్టు తెలుస్తోంది. “ప్రచారం చేయొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఉంటే.. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లొచ్చు. కానీ, పూర్తిగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చేలా మంచి చేస్తున్నా కూడా దానికి విషం పూసి ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం.
దీనిని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించి కొత్త చట్టం చేసే ఆలోచనను తోసిపుచ్చలేం” అని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అదేసమయంలో వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు పార్టీ కీలక నాయకుల సేవలను కూడా వినియోగించుకునేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 1, 2023 6:28 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…