Political News

తెలుగు రాష్ట్రలకు ఒట్టి చేతులేనా..

వార్షిక బడ్జెట్ వచ్చేస్తోంది. మధ్య తరగతి వర్గాలకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి. బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే పద్దుల్లో ఆదాయపన్ను పరిమితిని గతంలోలాగే రెండున్నర లక్షలుగా కొనసాగిస్తూ, శ్లాబులను మాత్రం మార్చనున్నారని విశ్వసిస్తున్నారు.స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి మరో 15 నుంచి 25 వేల వరకు పెంచే వీలుందని చెబుతున్నారు. సెక్షన్ 80సీ కింద ఇచ్చే రాయితీని లక్షన్నర నుంచి ఇంకాస్త పెంచబోతున్నారు.

పేద, గ్రామీణ వర్గాలకు ప్రోత్సాహకాలు
గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించే ప్రకటనలు ఉండొచ్చు. సామాజిక భద్రతా కార్యక్రమాలకు కూడా ఊతమివ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు గ్రామీణ కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించనున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో పేద, మధ్య తరగతి వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలతో పాటు నష్టాల్లో ఉన్న స్టార్టప్‌లను ఆదుకుంటారని చెబుతున్నారు.

దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడేందుకు స్టాంప్ డ్యూటీ తగ్గించబోతున్నారు. ఇళ్ల తాకట్టుపై వడ్డీ రాయితీని రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచాలన్న డిమాండ్ పరిశీలించే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రలకు ఒట్టి చేతులేనా..

కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ సారి కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని రెండు రాష్ట్రాల ఆర్థికవేత్తలంటున్నారు. ప్రత్యేక హోదాపై ఆశలు వదుకున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కేంద్రం ఈ సారైనా స్పష్టత ఇస్తుందో లేదో చూడాలి. పేదల ఆహార భద్రత విషయంలో కేంద్రం శీతకన్నేసిందని ఏపీ ప్రభుత్వం వాపోతోంది. అదనంగా నెలకు 77 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని కేటాయించాలని ఏపీ కోరుతోంది. విశాఖ మెట్రో రైలు ఈ సారి కూడా ఎండమావు కాకూడదని జనం ఎదురు చూస్తున్నారు. నత్తనడక నడుస్తున్న ప్రాజెక్టులకు ఆర్థిక వనరులివ్వాలని ఏపీ కోరుతోంది.

విభజన చట్టం హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఎదురు చూస్తోంది. గతేడాది ప్రస్తావించిన 35 డిమాండ్ల ఈ సారి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్న ఆవేదన తెలంగాణ ప్రజల్లో ఉంది. అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఆశించిన మేరకు ఉండక పోవచ్చన్నది ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట.

This post was last modified on January 31, 2023 9:15 pm

Share
Show comments
Published by
Satya
Tags: Budget

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

1 hour ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

1 hour ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

3 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

3 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

4 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

5 hours ago