టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయత్ర ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతోంది. ఎక్కడ చూసినా జనం ఆయనకు నీరాజనం పడుతున్నారు. ప్రతీ ఒక్కరినీ పలుకరించుకుంటూ వెళ్తున్న లోకేష్ యాత్ర రెండో రోజున బీసీల సమావేశంలో మాట్లాడారు.. ఏపీలో బీసీలను జగన్ సర్కారు అణచివేస్తున్న తీరును ఆయన ఎండగడ్డారు. తాడేపల్లి ప్యాలెస్‌లో రెడ్లు హ్యాపీగా కూర్చుంటే బీసీ నేతలు బయట చేతులు కట్టుకుని నిల్చున్నారని ఆయన ఆరోపించారు..
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు
వైఎస్ జగన్ అధికారానికి వచ్చిన తర్వాత 2 వేల 650 మంది బీసీలపై కేసులు పెట్టారని లోకేష్ గుర్తుచేశారు. 26 మంది బీసీలను హత్య చేశారన్నారు. రాజకీయంగా బీసీలు ఎదగకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న తాము అధికారంలోకి రాగానే వారికి ఉద్యోగావకాశాలు పెంచుతామని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో కూడా బీసీ రిజర్వేషన్ కల్పించేందుకు అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. దాని వల్ల సామాజిక న్యాయం ఏర్పడుతుందని లోకేష్ అంటున్నారు. నిజానికి టీడీపీలో చాలా మంది బీసీ నేతలున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు లాంటి బీసీ నేతలు పార్టీలో సమర్థంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో బీసీ దళం కూడా పనిచేస్తోంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తోంది. కడపల్లెలో బీసీలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.వారి సమస్యలు విని లోకేష్ చలించిపోయారు. వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేరుస్తానన్న హామీని జగన్ పట్టించుకోలేదని లోకేష్ గుర్తుచేశారు. రిజర్వేషన్లను తగ్గించి సుమారు 16,500 మంది బీసీలకు పదవుల్ని దూరం చేశారని చెప్పారు…
కుల సంఘాల ఆవేదన
లోకేష్ ను బీసీ సంఘాలు, కుల సంఘాలు కలుస్తున్నాయి. తమపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపుకు దిగుతోందని పలు కుల సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. వారందరనీ ఓదార్చుతూ, నేనున్నానంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లెక్క తేల్చుతామని ఆయన హామీ ఇస్తున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్స్ పనులు సగంలోనే ఆగిపోవడంతో వాటి ప్రస్తావన కూడా లోకేష్ వద్ద వస్తోంది. తన పాదయాత్రతో వైసీపీ ప్రభుత్వంలో చలనం వచ్చి కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తే మంచిదేనని లేని పక్షంలో టీడీపీ అధికారానికి రాగానే ప్రథమ ప్రాధాన్యంగా వాటిని పూర్తి చేస్తామని లోకేష్ చెబుతున్నారు. కమ్యూనిటీ హాల్స్ స్థలాలను స్థానిక వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని కూడా జనం లోకేష్ వద్ద ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు మీద నేరుగా కోపం చూపించలేక తమపై కక్షసాధిస్తున్నారని పలువురు వాపోతున్నారు. వాటన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని లోకేష్ వారికి భరోసా ఇస్తున్నారు…
This post was last modified on January 30, 2023 8:54 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…