సమకాలీన రాజకీయాలు.. రాజకీయ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు లోతుగా సర్వేలు.. అధ్యయనాలు చేసే మీడియా సంస్థగా ఇండియా టుడే సంస్థకు మంచి పేరు ఉంది. సీ ఓటరుతో కలిసి కొన్నేళ్లుగా ఈ సంస్థ అధ్యయనం చేయటంతో పాటు.. జాతీయ.. రాష్ట్రాల రాజకీయాల మీద విశ్లేషణ చేయటం తెలిసిందే. తాజాగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజాదరణలో ముందున్న ముఖ్యమంత్రులు ఎవరన్న సర్వేను చేపట్టారు. దీనికి సంబంధించిన సర్వే ఫలితాల్ని తాజాగా ఇండియా టుడే సంస్థ వెల్లడించింది.
ఈ సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే.. టాప్ 10లో ప్రజాదరణ ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మిస్ కావటం గమనార్హం. గత ఏడాది మొదట్లో నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంతం చేసుకుంటే.. రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. గత ఏడాది మలి విడత నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలవగా.. అంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న యోగి ఏకంగా ఏడో స్థానానికి దిగజారటం గమనార్హం.
తాజాగా విడుదల చేసిన సర్వే రిపోర్టులో 73.2 శాతం ఆదరణతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిస్తే.. రెండో స్థానంలో ఢిల్లీ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నిలిచారు. నాలుగో స్థానంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిలవగా.. ఐదో స్థానంలో శివరాజ్ సింగ్ నిలిచారు. ఆరో స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఫుష్కర్ ధామి.. ఏడో స్థానంలో యూపీ సీఎం యోగి నిలిచారు.
ఎనిమిది.. తొమ్మిది.. పది స్థానాల విషయానికి వస్తే.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 45.7 శాతం.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 43.6 శాతం.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 39.7 శాతంతో పట్టికలో చివర్లో నిలిచారు. కానీ.. దేశాన్ని ఏలేద్దామని జాతీయ పార్టీన పెట్టిన కేసీఆర్ మాత్రం జాబితాలోనే కనిపించకపోవటం గమనార్హం. దేశాన్ని ఏలటం తర్వాత తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయినా ప్రజాదరణను సొంతం చేసుకునే విషయంపై కేసీఆర్ కాస్తంత ఫోకస్ పెంచితే మంచిదన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on January 30, 2023 6:34 am
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…