ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓ రేంజ్‌లో పుంజుకుంది. రెండు జిల్లాల్లోనూ కలిపి మొత్తం 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కేవలం ఐదు చోట్ల మాత్రమే విజయం దక్కించుకున్న టీడీపీ ఈ మూడున్నరేళ్లలో భారీగా పుంజుకుందని తాజా అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి రెండు గోదావరి ఉమ్మడి జిల్లాల్లోనూ టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే.. గత వైసీపీ దూకుడు, జగన్ పాదయాత్రతో టీడీపీ ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది.
అయితే.. జగన్‌పై ఆశలు పెట్టుకున్న కాపు నాయకులు.. ఇతర సామాజిక వర్గాలు కూడా ఇప్పుడు మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఐప్యాక్ సహా టీడీపీ చేయించిన స్వతంత్ర సర్వేల్లోనూ వైసీపీకి ఎదురు గాలి వీస్తుండగా.. టీడీపీకి సానుకూల పవనాలు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి 42 శాతం నుంచి 48 శాతం వరకు ఓటు బ్యాంకు కనిపిస్తోంది.
అదికూడా పార్టీ ఒంటరిగా పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ విజయానికి అవకాశం మెరుగుపడినట్టు చెబుతున్నారు. ముమ్మిడివరం, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో టీడీపీ మెజారిటీ ఓటు బ్యాంకును కైవసం చేసుకుంది. ఇక, సిట్టింగ్ స్థానాలైన రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మరోసారి విజయం దక్కించుకునేదిశగా టీడీపీ వేగంగా పరుగులు పెడుతోంది. ఇక, కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఫైట్ భీకరంగా ఉందని తెలుస్తొంది.
ఇక, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ రెండు పార్టీల మధ్య పోరు తీవ్రంగానే సాగుతున్నట్టు తెలుస్తోంది. దెందులూరు, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ విజయం రాసిపెట్టుకోవచ్చని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇక, గోపాలపురం ఎస్పీ నియోజకవర్గంలోనూ ఈ దఫా విజయం టీడీపీదేనని అంటున్నారు. అయితే, ఏలూరు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో మాత్రం పోటీ తప్పదని అంటున్నారు. ఏదేమైనా.. గత ఎన్నికలతోపోల్చుకుంటే.. టీడీపీ జోరుగా పుంజుకుందని పార్టీ అంచనా వేసింది.
This post was last modified on January 28, 2023 10:59 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…