జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు సంధించారు. “నేను తీవ్రవాదిగా మారితే తట్టుకోలేరు” అని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడుతున్నారని.. రాష్ట్రాన్ని మూడు ముక్కలుచేయాలని తలపోస్తున్నారని.. ఇదే కనుక జరిగితే.. తాను తీవ్రవాదిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. అప్పుడు వైసీపీ నేతలు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతమని.. వైసీపీనో.. సజ్జల రామకృష్ణారెడ్డి సొంతమో కాదని గుర్తుంచుకో వాలని పవన్ అన్నారు. “నా లాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు” అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ నిప్పులు చెరిగారు. ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని మండిపడ్డారు.
“విసిగిపోయాం.. మీ బతుకులకేం తెలుసు? కానిస్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా?” అని పవన్ ప్రశ్నించారు. “మేం దేశ భక్తులం.. ఏపీని ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? సన్నాసులతో విసిగిపోయాం” అని నిప్పులు చెరిగారు.
మీ స్వార్థం కోసం స్టేట్మెంట్లు ఇవ్వొద్దని వైసీపీ నాయకులకు పవన్ హితవు పలికారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సాయిరెడ్డి చనిపోయారని.. గుంటూరులో హబీబుల్లా మస్తాన్ మరణించారని.. ఆ సంగతి మీకు తెలుసా? అని వైసీపీ నాయకులను పవన్ నిలదీశారు. మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దన్నారు. మొత్తానికి పవన్ హాట్ కామెంట్లు దుమ్ము రేపుతున్నాయి. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on January 27, 2023 6:15 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…