చిన్నా పెద్దా.. రాజు పేద తేడా ఏమీ లేకుండా అందరినీ అంటుకుంటూ పోతోంది కరోనా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. కరోనా మినహాయింపులేమీ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఫిలిం సెలబ్రెటీలు.. ఇలా చాలామంది ప్రముఖుల్ని కరోనా పలకరించింది. తాజాగా ఏపీలో ఓ కలెక్టరు సైతం కరోనా బారిన పడ్డారు. ఆయన పేరు.. శామ్యూల్ ఆనంద్ కుమార్. గుంటూరు జిల్లా కలెక్టరుగా కోవిడ్ నియంత్రణ కోసం కష్టపడుతున్న ఆయనకు కూడా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడం, లక్షణాలు మరీ తీవ్రంగా ఏమీ లేకపోవడంతో కలెక్టరు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. కలెక్టర్ ఛాంబర్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
కరోనా నియంత్రణలో చాలా కీలంగా వ్యవహరిస్తున్న అధికారే కరోనా బారిన పడటం జిల్లాలో వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది. జిల్లాలో ఇంకా చాలామంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కరోనా సోకింది. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏపీడీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారి, పలువురు జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో వాళ్లు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. గురువారం గుంటూరు జిల్లాలో 577 కొత్త కేసులు వెలుగు చూడగా.. మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటిపోయింది. ఇప్పటిదాకా జిల్లాలో కోవిడ్ కారణంగా 63 మంది ప్రాణాలు వదిలారు. మంగళవారం కూడా అయిదుగురు కరోనాతో మరణించడం గమనార్హం. గత పది రోజుల్లోనే జిల్లాలో 4 వేల దాకా కేసులు వెలుగుచూశాయి.
This post was last modified on July 22, 2020 12:41 am
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…