ఔను! టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో అనేక లాభాలు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా గతంలో వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా లోకేష్‌పై వేసిన పప్పు అనే ముద్రను తుడిచేసుకోవడం కనిపిస్తోంది. లోకేష్‌కు మాట్లాడడమే చేతకాదు.. అని మంత్రులు రోజా.. వంటివారు బహిరంగంగానే విమర్శించేవారు. మంగళగిరికి, మందలగిరికి తేడా తెలీదు అని ఎద్దేవా చేసేవారు.
ఇక, వర్ధంతికి, జయంతికి కూడా తేడా తెలియదని కామెంట్లు చేసేవారు. ఇక, ప్రజాదరణ లేదని నాయకు డిగాకూడా నారా లోకేష్‌పై ముద్ర ఉంది. ఇటీవల మంత్రి నారాయణ స్వామి కూడా.. నారా లోకేష్ అంటే.. కేవలం చంద్రబాబు కొడుకుగా మాత్రమే తాము చూస్తామని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేం దుకు నారా లోకేష్ యువగళాన్ని వినియోగించుకుంటున్నారని సుస్పష్టం.
ఈ పాదయాత్ర ద్వారా.. మరో రెండు ప్రధాన లక్ష్యాలు సాధించాలని పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోం ది. వాటిలో ఒకటి.. తనను తాను నాయకుడిగా ఆవిష్కరించుకోవడం. తద్వారా.. పార్టీకి కాబోయే అధినేత గా ప్రచారం కల్పించుకోవడమే కాకుండా.. ప్రజామోదం పొందడం కూడా ఈ యాత్ర వెనుక కీలకమైన విషయంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు టీడీపీ అంటేచంద్రబాబు మినహా మరొకరు మనకు కనిపించడం లేదు.
దీనివల్ల రేపు పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీనిని గమనించిన నారా లోకేష్… చంద్రబాబు కూడా యువగళం ద్వారా.. టీడీపీకి కాబోయే అధ్యక్షుడిగా నారా లోకేష్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారనేది కూడా తెలుస్తోంది అదేసమయంలో రాష్ట్రానికి యువ నేత దిక్సూచిగా మారనున్నారని.. కూడా టీడీపీ నాయకులు అంటున్నారు. అంటే.. మొత్తంగా యువగళం ద్వారా.. ఇటు వ్యక్తిగతంగా అటు పార్టీ పరంగా.. మరోవైపు.. రాష్ట్రం పరంగా కూడా కొన్ని సంచలన విషయాలను ప్రజల్లోకి చేరాలనేది లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on January 26, 2023 6:01 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…