రాయపాటి సాంబశివరావు… ఆ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కాంగ్రెస్, టీడీపీలో ఆయన హవా కొనసాగింది. ప్రజల మనిషిగా ఆయనకు మంచి పేరే ఉంది. అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తారన్న ట్రాక్ రికార్డు ఉంది. ఓడిపోతూ, గెలుస్తూ రాజకీయాలు చేసే గుంటూరు, నరసరావుపేట మాజీ ఎంపీ గత ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఇంకేముందు వయోభారంతో రాజకీయాలను నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. రెండు సంవత్సరాలు మౌనంగా ఉండటంతో సీన్లో లేనట్లే అనుకున్నారు. అంతలోనే రాయపాటి మళ్లీ బయటకు వచ్చారు. ఏకంగా ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు…
వీల్ ఛైర్ పాలిటిక్స్
రాయపాటికి బాగా వయసైపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడాయన వీల్ ఛైర్లో తిరుగుతున్నారు. రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్టీయార్ వర్థంతి కార్యక్రమాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. రెండు మూడు ఫంక్షన్లకు ఆయన వీల్ ఛైర్లోనే వచ్చారు. తాడికొండ ఫంక్షన్లో మీడియాతో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి రాజవర్థన్ పోటీ చేస్తారని, గెలిచి మంత్రి అవుతారని కూడా రాయపాటి చెప్పేశారు. దానితో మీడియా వారు, అక్కడున్న టీడీపీ అభిమానులు ఖంగుతిన్నారు. నిజానికి జిల్లా పార్టీ అధ్యక్షుడైన, తాడికొండ ఇంఛార్జ్ శ్రావణ్ కుమార్ కు తాడికొండ టికెట్ ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి గుర్తు చేస్తే నేను చెబుతున్నా కదా అంటూ ఎదురు దాడికి ఆయన ప్రయత్నించారు..
కాళ్లు బావుంటే నేనే పోటీ
రాయపాటి మరో స్కడ్ వదిలారు. ఎన్నికల్లోపు కాళ్లు బాగుపడితే తానే పోటీ చేస్తానని నేరుగా చంద్రబాబుకే ఆఫరిచ్చేశారు. లేని పక్షంలో తన కుమారుడికి టికెటివ్వాలని డిమాండ్ పెట్టారు ఎంపీ, ఎమ్మెల్యే ఏదో ఒక్క టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ పెట్టారు..
ఒక ఫ్యామిలీ రెండు టికెట్లు
రాయపాటి ఇప్పుడు తన కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతున్నారు. తన కొడుకు, కూతురు ఇద్దరికీ టికెట్లు కావాలని చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. పార్టీ అధినేత ఆయనకు గట్టిగా క్లాస్ తీసుకుని ఒక టికెట్ చూద్దాంలే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. దానితో రాయపాటి లోకల్, నాన్ లోకల్ చర్చ తెచ్చారు. నరసరావు పేట ఎంపీ టికెట్ కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ కు ఇవ్వాలని చంద్రబాబు డిసైడైనట్లు రాయపాటి గుర్తించారు పైగా పుట్టా సుధాకర్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు. దానితో ఇప్పుడు కడప వారికి టికెటిస్తే ఓడిస్తామని రాయపాటి హెచ్చరిస్తున్నారు. పైగా తాను ఇండిపెండెంట్ గా దిగుతానని కూడా ఆయన ప్రకటించారు…కడప వారికి పల్నాడులో ఏం పని అని రాయపాటి ప్రశ్నిస్తున్నారు…
బీసీ సంఘాల ఆగ్రహం
రాయపాటి తీరుపై బీసీ సంఘాలు ఆగ్రహం చెందుతున్నాయి. పుట్టా మహేష్, బీసీ సామాజిక వర్గం వ్యక్తి కావడంతో రాయపాటి నాన్ లోకల్ ఫీలింగ్ తెచ్చారని వారి ఆరోపణ. చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా జయదేవ్ కు గుంటూరు టికెట్ ఇచ్చినప్పుడు రాయపాటి మాట్లాడలేదని వారు గుర్తు చేస్తున్నారు. అగ్రవర్ణాలకు నాన్ లోకల్ ఉండదా, బీసీలకే ఉంటుందా అని బీసీ సంఘాల ప్రశ్న. మరి దీనికి రాయపాటి సమాధానం ఏమిటో చూడాలి…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…