Political News

ఏంటి బాలయ్యా! ఇది.. చంద్రబాబు అసంతృప్తి?

నందమూరి బాలకృష్ణ నోటి దురుసుతనం తెలుగుదేశం పార్టీకి కొత్త ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఎన్నికలకు ముందు పార్టీకి అన్నీ అనుకూలంగా మారుతున్నాయనుకుంటున్న తరుణంలో కొన్ని వర్గాలకు కోపం వచ్చేలా బాలయ్య వ్యాఖ్యలు చేయడంపై పార్టీ అధినేత చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో మాట్లాడిన బాలయ్య ‘ఆ రంగారావు, ఈ అక్కినేని తొక్కినేని’ అంటూ మాట్లాడడం.. దానికి అక్కినేని కుటుంబానికి చెందిన నాగచైతన్య, అఖిల్‌లు ట్విటర్ వేదికగా కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. అంతేకాదు.. అక్కినేని అభిమాన సంఘాల వారు కూడా బాలకృష్ణకు వ్యతిరేకంగా ప్రకటన రిలీజ్ చేశారు. తాజాగా ఎస్వీ రంగారావును అవమానించారంటూ ఆయన అభిమానులు, కాపు సంఘాల వారు కూడా బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదం ముదురుతుండడంతో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారట. ముఖ్యంగా అక్కినేని అభిమానుల కంటే కూడా కాపుల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు అలర్ట్ అయినట్లు సమాచారం.

2019 ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత రానున్న ఎన్నికల కోసం టీడీపీ అన్ని రకాలుగా సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఈసారి జనసేనతో కలిసి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దానివల్ల కాపు ఓట్లు గంపగుత్తగా పడతాయని.. అప్పుడు భారీ సంఖ్యలో సీట్లు సాధించడం ఖాయమవుతుందన్నది టీడీపీ ప్లాన్. కానీ… ఇప్పుడు ఇలాంటి గొడవలతో కాపుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటే నష్టపోతామని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట.

కాగా.. బాలయ్య నోరు జారడమే తరువాయి అన్నట్లు వివాదాన్ని మరింత పెద్దది చేసేలా కొందరు బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పుడు ప్రచారంలోకి తెస్తుండడంతో జనసేన, చిరంజీవి అభిమానులూ కొందరు ఆగ్రహానికి లోనవుతున్నారు. ‘చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యాడు.. రాజకీయాలంటే మా కుటుంబానికే సాధ్యం’ అని గతంలో బాలయ్య అన్న మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నారు. అంతేకాదు.. జనసేన గురించి గతంలో బాలయ్య వివిధ సందర్భాల్లో అన్న మాటలూ ఇప్పుడు ప్రచారంలోకి తెస్తున్నారు.

ఇవన్నీ కలిసి కాపులలో కోపం కలిగే పరిస్థితులు కనిపిస్తుండడంతో వివాదానికి వీలైనంత వేగంగా పుల్ స్టాప్ పెట్టడం బెటరని చంద్రబాబు అనుకుంటున్నారట. బాలయ్యతో క్షమాపణలు చెప్పించడం ద్వారా వివాదం ముగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. బావ అడిగితే బాలయ్య కాదనరు కదా.. ఇవ్వాళో రేపో సారీ చెప్తారేమో చూద్దాం.

This post was last modified on January 25, 2023 12:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

38 శాతం ఓట్ షేర్ కూడా పోయేలా ఉంది జగన్!

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…

11 hours ago

నా తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా?..లోకేష్ ఫైర్

మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…

11 hours ago

రఘురామతో రాజీకి వచ్చిన సాయిరెడ్డి

వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…

13 hours ago

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న శ్రీరెడ్డి

వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…

14 hours ago

ఏపీకి రాందేవ్‌-ర‌విశంక‌ర్‌: బాబుకు మంచి సిగ్న‌ల్స్ ..!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవ‌లం ఐదు మాసాలు మాత్ర‌మే పూర్త‌యింది. కానీ,…

16 hours ago

ఆమిర్‌తో పైడిప‌ల్లి.. సాధ్య‌మేనా?

వంశీ పైడిప‌ల్లికి యావ‌రేజ్ డైరెక్ట‌ర్ అని పేరుంది. అత‌ను గొప్ప సినిమాలేమీ తీయ‌లేదు. కానీ.. అత‌ను కెరీర్లో ఇప్ప‌టిదాకా పెద్ద…

16 hours ago