ఏపీలో రాజకీయ పవనాలు మారుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు కూడా పార్టీల పరిస్థితి మారు తోందనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం కుటుంబాల్లోనే ఈ చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా వైసీపీ, టీడీపీలు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లోనూ ఈ మార్పు సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ది లేదనే విషయం పెద్ద ఎత్తున ప్రజల మధ్య చర్చకు వస్తోంది.
అదే సమయంలో ప్రజలు కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి జగన్ కొందరికి డబ్బులు ఇస్తున్నా.. తమ కుటుంబాల పరిస్థితిని గమనిస్తున్న వారు.. మాత్రం అభివృద్ధి లేదనే విషయాన్ని గుర్తి స్తున్నారు. మరోవైపు.. చంద్రబాబు ఇమేజ్ పెరుగుతుండడం కూడా మారుతున్న వాతావరణానికి దన్నుగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి వైసీపీకి వ్యతిరేకంగా మారుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
మరోవైపు..యువగళం పేరుతో టీడీపీ యువ నాయకుడు పాదయాత్రకు రెడీ అవుతుండడం కూడా.. దీనికి దన్నుగా మారింది. వైసీపీ ప్రభుత్వం మైనారిటీలకు మేలు చేసిందని ఒకవైపు ఆ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రకటించి రెండురోజులు కూడా కాకముందే.. గుంటూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన చేపట్టిన గడపగడపకు కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ముస్లింలు బాయ్ కాట్ చేశారు.
ఇక, మరో ఎస్సీ నియోజకవర్గం ఏకంగా మంత్రి వస్తున్నారని తెలిసి.. పెద్ద ఎత్తున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపైకి చేరుకుని నినాదాలు చేశారు. తమకు ఈ ప్రభుత్వం చేసిందేంటని నిలదీశారు. దీంతోఆమె.. సంక్షేమ పథకాల జాబితా ప్రస్తావించినా.. అందరికీ ఇస్తున్నదే ఇస్తున్నారని.. కనీసం రోడ్లు కూడా వేయడంలేదని.. వ్యాఖ్యానించారు. అంటే.. మొత్తంగా ఇస్తున్న సంక్షేమం పనిచేయడం లేదనే సంకేతాలు ప్రజలనుంచి వచ్చాయి. వీటికితోడు చంద్రబాబుదూకుడు.. ప్రభుత్వ వైఖరి ఇలా.. అన్నీ కూడా.. మారుతున్న రాజకీయ పవనాలను స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 25, 2023 7:45 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…