Political News

విజ‌య‌సాయిరెడ్డికి క‌రోనా పాజిటివ్?

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మ‌రోమారు ఆస‌క్తిక‌ర అప్‌డేట్‌తో వార్తల్లోకి ఎక్కారు. గ‌త కొద్దిరోజులుగా వైసీపీ అంత‌ర్గ‌త‌ రాజ‌కీయాలు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆయ‌న్ను దూరం పెడుతున్నార‌నే ప్ర‌చారంతో మీడియా దృష్టిని ఆక‌ర్షించిన విజ‌యసాయిరెడ్డి తాజాగా క‌రోనా పాజిటివ్ అనే ప్ర‌చారంతో మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.

విజ‌య‌సాయిరెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు వార్త‌లు ప్ర‌సారం చేశాయి. దివంగ‌త సీఎం వైఎస్సార్ జయంతి సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో విజయసాయిరెడ్డి పాల్గొన్నార‌ని పేర్కొంటూ అదే కార్యక్రమంలో పాల్గొన్న స‌మ‌యంలో కరోనా సోకింద‌ని ఆయా వార్తా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. అయితే, దీనికి విజ‌య‌సాయిరెడ్డి ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

క‌రోనా పాజిటివ్ వార్త‌ల నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి పరోక్షంగా త‌న స్పంద‌న తెలియ‌జేశారు. కోవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో స్వ‌తహాగా నేనే నిర్ణ‌యం తీసుకొని వారం నుంచి ప‌దిరోజుల పాటు క్వారంటైన్లో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ స‌మ‌యంలో కేవ‌లం అత్య‌వ‌స‌ర‌మైన సంద‌ర్భంలో మాత్ర‌మే టెలిఫోన్‌లో అందుబాటులో ఉంటాను అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే, త‌న‌కు క‌రోన అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని విజ‌యసాయిరెడ్డి తిప్పికొట్ట‌లేదు. అలా అని అంగీక‌రించ‌లేదు.

ఇదిలాఉండ‌గా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీలో 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 4944 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం నమోదైన కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఇందులో 32,336 కేసులు యాక్టివ్ కాగా 25,574 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మ‌రోవైపు గడిచిన 24 గంటల్లో ఏపీలో 62 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య758కి చేరింది.

This post was last modified on July 21, 2020 11:02 pm

Share

Recent Posts

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

26 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

3 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

5 hours ago