ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సర్వేలు కామన్. ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు చేయించుకుం టాయి. దీనిని ప్రచారం చేసుకునేందుకు లేదా.. పార్టీ నేతల్లో భరోసాను నింపేందుకు పార్టీలు వినియోగిం చుకుంటాయి. దీనికి సంబంధించి ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. అలానే ఇప్పుడు అంతర్గత సర్వేలు పుంజుకున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు టీడీపీ కూడా అంతర్గత సర్వేలు చేయిస్తున్నాయి.
తాజాగా టీడీపీకి అత్యంత కీలక నాయకుడిగా పేరున్న ఎన్నారై.. ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే ఒకటి అంత ర్గతంగా చేయించినట్టు తెలిసింది. ఈ సర్వేలో టీడీపీ పరిస్థితి ఏంటి? పార్టీపై ప్రజలు ఏమనుకుంటున్నా రు? వైసీపీకి గెలిచే ఛాన్స్ ఎంత? ఏ ప్రాంతంలో పరిస్థితి టీడీపీకి ఎలా ఉంది? వంటి అంశాలను కూలం కషంగా చర్చించారని తెలిసింది. దీని ప్రకారం.. తాజాగా టీడీపీ నేతల మధ్య జరుగుతున్న చర్చలను బట్టి.. టీడీపీకి సానుకూల పవనాలు వున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీ జోష్ పెరిగిందని ఈ డిజిటల్ సర్వే స్పష్టం చేసింది. ఇక్కడి మెజారిటీ స్థానాల్లోనే కాకుండా.. గతంలో 2014లో వచ్చిన ఊపు వస్తుందని తేల్చింది. కూన రవికుమార్ గెలుపు గుర్రం ఎక్కుతారని తేల్చింది. అదేవిధంగా ఇద్దరు మంత్రులను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. ఇక, ఉభయ గోదావరి.. కోస్తా జిల్లాల్లోనూ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు.
అయితే, విశాఖపై మాత్రం తర్జన భర్జన కొనసాగుతోందని అంటున్నారు. వైసీపీ ప్రకటించిన రాజధాని విషయంపై ప్రజలు గుంభనంగా ఉన్నారని.. కొందరు వద్దని అంటున్నా .. మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని.. ఆ రకంగా అయినా తమ ప్రాంతం మరింత డెవలప్ అవుతుందని చెబుతున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. కోస్తాలోనూ అటు ఇటుగా టీడీపీకి సానుకూల పవనాలు ఉన్నాయని డిజిటల్ సర్వే స్పష్టం చేసింది.
అయితే, ఉమ్మడి కృష్ణా, గుంటూరుజిల్లాల్లో మాత్రం ఫిఫ్టీ-ఫిఫ్టీ రిజల్ట్ వస్తుందని.. సీమలో మాత్రం టీడీపీ ఎదురీత తప్పదని ఈ సర్వే చెప్పడం గమనార్హం. ఇక, చంద్రబాబు గెలుపు సాధ్యమేనని చెప్పిన సర్వే.. నారా లోకేష్‌కు రెండు నియోజకవర్గాల్లో కేటాయింపులు తప్పదని తెలియజేయడం గమనార్హం. అయితే.. ఈ సర్వేపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే.. ఇది ఆన్‌లైన్‌లో నిర్వహించిన చిన్నపాటి సర్వే కావడం.. కేవలం ఒక్కొక్క ప్రాంతం నుంచి వెయ్యి .. రెండు వేల లోపు వారినే ప్రశ్నించడంతో మరింత విస్తృతంగా సర్వే చేయించాలని పార్టీ అధినేత నిర్ణయించారని తెలుస్తోంది.
This post was last modified on January 24, 2023 6:11 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…