అంచనాలు తప్పలేదు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా తప్పదన్న రీతిలో సాగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే దారుణంగా హతమార్చిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి కొన్ని ఆరోపణల పేరుతో ప్రచారం జరగటం తెలిసిందే.
వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయటం తెలిసిందే. అయితే.. ఇవన్నీ అనుమానాలు కొట్టిపారేయటం తెలిసిందే. అనంతరం సీబీఐ అనుమానితుల జాబితాలో ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు ఉన్నట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. దాదాపు ఏడాదిగా ఈ వైసీపీ ఎంపీకి సీబీఐ నుంచి నోటీసులు ఖాయమన్న ప్రచారం జరిగింది.
అవినాశ్ రెడ్డి ప్రత్యేకత ఏమంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన వాడు కావటం.. ఆయన పేరు కానీ వివేకా హత్య కేసులో అనుమానితుల జాబితాలో వస్తే దాని కారణంగా జరిగే నష్టం గురించి తెలియంది కాదు. అందుకే.. ఇంతకాలం తనకున్న అధికారం సాయంతో ముఖ్యమంత్రి అడ్డుకున్నారన్న ప్రచారం సాగింది. అయితే.. అక్కడఉన్నది సీబీఐ కావటం.. కేంద్రం వరకు విషయం వెళ్లడటంతో పాటు.. ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా.. పకడబ్బందీగా చేపట్టాలన్న ఆదేశాలనుతూచా తప్పకుండాపాటించినట్లుగా చెబుతున్నారు.
అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఎన్నికలు ముంచుకురావటం.. ఆ హత్య వెనకున్నది టీడీపీ నేతలుగా ప్రచారం చేయటం.. అదేమీ నిజం కాదన్న విషయం చాలా త్వరగా అర్థం కావటం తెలిసిందే. అయితే.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పేరుపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇదిలాఉండగా.. తాజాగా ఆయనకు వైఎస్ వివేకా హత్య కేసులో నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించటం గమనార్హం. ఇంతకాలం నోటీసులు అందుకుంటారన్న ప్రచారం బోలెడంత మంది నుంచి వచ్చినా… అదేమీ నిజం కాదన్నట్లుగా వైసీపీ నేతలు పెద్దగా రియాక్టు కాలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా సీబీఐ జారీ చేసిన నోటీసుల సారాంశాన్ని చూస్తే.. మంగళవారం ఉదయం 11 గంటలకు వివేకా హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల లోని వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం అక్కడ.. ఎంపీ అవినాశ్ తన తండ్రి గురించి వివరాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా రానున్న పది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. సీబీఐ ఇచ్చిన తాజా నోటీసులు.. రానున్న రోజుల్లో పలు రాజకీయ పరిణామాలకు వేదికగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on January 24, 2023 6:06 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…