కొన్ని కొన్ని విషయాలు చెప్పుకొనేందుకు ఇబ్బందిగా ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామ ని.. వైసీపీని తరిమి కొడతామని అంటున్న టీడీపీకి.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేకపోవడం.. ఉన్న వాటిలో ఇద్దరేసి చొప్పున ఉండడం.. మరికొన్ని నియోజకవర్గాల్లో అన్నదమ్ములే పోటీ పడడం.. సవాళ్లు రువ్వుకోవడంతో పార్టీ పరిస్థితి చిత్రంగా మారింది. దీనిని ఎందుకో చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఎన్నికల సమయం వచ్చిన తర్వాత చూసుకుందాం లే! అని అనుకుంటున్నారో.. లేక, ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేకపోయినా ఫర్వాలేదని భావిస్తన్నారో తెలియడం లేదు. పైగా ఆయనేమో.. 175కి 175 సీట్లో ఎందుకు గెలవలేమని చెబుతున్నారు. దీనిని ప్రామాణికంగా తీసుకోవాలని కూడా అంటున్నారు. ఏదేమై నా.. చంద్రబాబుకు వ్యూహాలు ఉన్నాయి. కానీ, కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేకపోవడం ఇప్పుడు చర్చకు వస్తోంది.
ఉదాహరణకు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం, ప్రకాశంలోని చీరాల, గుంటూరులోని పశ్చిమ, విజయ వాడలోని పశ్చిమ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు లేరు.కొన్ని చోట్ల గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నవారు వైసీపీలోకి వెళ్లిపోగా.. ఓడిపోయిన వారు సైలెంట్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదు.
ఏలూరులో మాగంటి బాబు రాజకీయంగా అచేతనం అయిపోయారు. దీంతో ఏలూరు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి అంతు చిక్కడం లేదు. పోలవరంలో ఇద్దరు నేతలు కుస్తీ పడుతున్నారు. విజయవాడ సెంట్రల్‌లో జనసేన దూకుడుగా ఉంది. టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. ఫస్టు వదులుకునే సీటు ఇదే. దీంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పక్క చూపులు చూస్తున్నారు. పశ్చిమలో జలీల్ ఖాన్ ఆరోగం బాగోలేదని బయటకు రావడం లేదు. ఎంపీ సీటులో అన్నదమ్ములు కొట్టేసుకుంటున్నారు. ఇలా.. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 7, 2023 5:16 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…