కడపజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మైదుకూరు. ఇక్కడ నుంచి పార్టీలు వేరైనా.. ఇద్దరే వ్యక్తులు.. ఒకరు తర్వాత.. ఒకరు.. గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. వారే.. డీఎల్ రవీంద్రారె డ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి. 1978 నుంచి ఈ ఇద్దరే ఇక్కడ ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ తరఫున శెట్టిపల్లి 1985, 1999 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, 2014, 2019 ఎన్నికల్లో ఈయన వైసీపీ తరఫున విజయం సాధించారు.
మరోవైపు.. డీఎల్ రవీంద్రారెడ్డి తొలినాళ్లలో ఇండిపెండెంట్‌గా గెలిచి..తర్వాత కాంగ్రెస్‌తీర్థం పుచ్చుకు న్నారు. మొత్తంగా డీఎల్.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి విజయం సాధించారు. పార్టీలు ఏవైనా కూడా శెట్టిపల్లి, డీఎల్‌ల మధ్యే మైదుకూరు రాజకీయం నడిచింది. ఎమ్మెల్యేలుగా వీరే చక్రం తిప్పారు. అయితే.. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ తరఫున ఎవరు ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ తాజాగా తెరమీదికి వచ్చింది.
ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా.. అంటే ఇంచార్జ్‌గా టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వ్యవహరిస్తు న్నారు. 2014, 2019లో సుధాకర్‌కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. కానీ, ఆయన ఓడిపోయారు. అయితే.. ఈయనకు టీడీపీలో నెంబర్ 2గా పిలుచుకునే యనమల రామకృష్ణుడు స్వయానా వియ్యంకుడు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరిశీలించుకునే పనిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
కానీ, పుట్టాకు మళ్లీ టికె ట్ఇవ్వడం అంటే.. కోరి వైసీపీకి ఇక్కడ విజయాన్ని అందించడమేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో డీఎల్ విషయం జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈయన వైసీపీలో ఉన్నట్టుగా చెబుతున్నా.. అలాంటిదేమీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో.. ఈయనను టీడీపీ సైకిల్ ఎక్కించుకుని టికెట్ ఇస్తే.. మైదుకూరులో గెలుపు సాధ్యమవుతుందని చెబుతున్నారు.
This post was last modified on January 23, 2023 6:47 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…