ఎస్సీల హక్యుల కోసం ఉద్యమించిన ఉద్యమకారులు.. కారెం శివాజీ.. జూపూడి ప్రభాకర్.. ఏమయ్యారు. ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నప్పటికీ.. వారు ఎందుకు మౌనంగా ఉన్నారు. కనీసం తెరమీదకి కూడా రావడం లేదు.. ఎందుకు? నిజానికి వీరిద్దరు.. మందకృష్ణమాదిగకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వాని కి అనుకూలంగా చక్రం తిప్పుతున్న పరిస్థితి ఉందనే విమర్శలు ఉన్నాయి.
గతంలో చంద్రబాబు హయాంలో 2014-19 వరకు కూడా కారెం, జూపూడి ఇద్దరూ కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో పదవులు కూడా తెచ్చుకుని.. ప్రాభవం పొందారు. ఇక, టీడీపీ సర్కారు పక్కన పడగానే వైసీపీ బాట పట్టారు. వైసీపీ అధినేత జగన్ను ఆశ్రయించి.. మళ్లీ పదవులు తెచ్చుకున్నారు. మొత్తానికి మూడేళ్లుగా ఈ ఇద్దరూ కనిపించడం లేదు.
వారి మాటలు కూడా వినిపించడం లేదు. మరి ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తోందంటే.. ఎస్సీలకు అన్యాయం జరిగిందని.. సీఎం జగన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు త్వరలోనే ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇదేం ఖర్మ కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలను ఏకం చేసేందుకు విజయవాడలో ధర్నాలు.. నిరసనలకు పిలుపునిచ్చారు.
మరి ఇంత చేస్తున్నా.. వైసీపీలో ఉన్న కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్‌లు ఏం చేస్తున్నారు? అనేది ప్రశ్న. అంటే.. ఎస్సీలకు న్యాయం జరిగినట్టేనని వారు భావిస్తున్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకప్పుడు ఇంకేముంది.. మాకు అన్యాయం చేస్తున్నవారే.. ఇలా పదవులకు లొంగిపోయారని.. తమకు ఇంకేం న్యాయం చేస్తారని అంటున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. విజయవాడలో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లకు సంబంధించి కనీసం వీరికి సమాచారం కూడా లేదని తెలిసింది. ఇదీ.. ఇప్పుడు వీరి పరిస్థితి!!
This post was last modified on January 22, 2023 2:58 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…