Political News

విజ‌య‌మ్మ వీడియోతో జ‌గ‌న్‌కు షాక్‌!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ఈ నెల 27న యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. సుమారు 4 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని 4 వంద‌ల రోజుల్లో పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు సంబంధించి అనుమ‌తి ఇచ్చే విష‌యంలో ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ముసుగులో గుద్దులాట‌కు దిగింది.

అనుమ‌తి విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌య‌మూ చెప్ప‌కుండా వేధిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు అంటు న్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి అనుమ‌తులు కోరుతూ.. టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి లేఖ రాశారు. రూట్ మ్యాప్‌ను కూడా అందించారు. ఏయే జిల్లాలు, ఎన్నేసి రోజులు అనే విష‌యంపై ఆయ‌న వివ‌రించారు. అయితే.. ఎట్ట‌కేల‌కు స్పందించిన డీజీపీ.. పాద‌యాత్ర‌లో ఎంత మంది పాల్గొంటున్నారు? ఏయే వాహ‌నాలు పెడుతున్నారు.. అంటూ.. మ‌రిన్ని వివ‌రాలు కోరారు.

అయితే.. పాద‌యాత్ర అనేది అప్ప‌టి వ‌ర‌కు ఉండే ప‌రిస్థితిని బ‌ట్టి ప్ర‌జ‌లు పాల్గొంటారు. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఇలాంటి వివ‌రాలు కోర‌కుండా అప్ప‌టి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. కానీ, ఇప్పుడు మాత్రం డీజీపీ ద్వారా స‌ర్కారు అడ్డంకులు సృష్టిస్తోంద‌ని.. టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్ప‌టి స‌మ‌యంలో వైసీపీ స‌ర్కారు అప్ప‌టి డీజీపీకి రాసిన లేఖ‌ను టీడీపీనేత‌లు మీడియాకు వెల్ల‌డించారు.

అప్ప‌టి పాద‌యాత్ర‌కు సంబంధించి పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి.. ఆశ్చ‌ర్య‌క‌రంగా వ్యాఖ్య లు చేశారు. పాద‌యాత్ర చేస్తున్నాం.. అనుమ‌తికోరాం.. అంతే.. వివ‌రాలు డీజీపీకి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా సీఎం జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌మ్మ కూడా పాద‌యాత్ర‌పై అప్ప‌ట్లో చేసిన వ్యాఖ్య‌ల తాలూకు బైట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్ర‌జాస్వామ్యంలోపాద‌యాత్ర చేసుకునే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంద‌ని.. ప్ర‌భుత్వాలు వాటికి అడ్డు చెప్ప‌రా ద‌ని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్షాల‌ను గౌర‌వించాల‌ని కూడా ఆమె అన్నారు. పాద‌యాత్ర ల‌కు అనుమ‌తించాల‌ని.. ప్ర‌తిప‌క్షాల‌ను గౌర‌వించాల‌ని.. అప్పుడే మంచి ప్ర‌భుత్వం అనిపించుకుంటుం ద‌ని ఆమె అన్నారు. ఇది.. జ‌గ‌న్ స‌ర్కారుకు చెంప పెట్టుగా మారింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక‌వైపు యువ‌గ‌ళానికి అడ్డంకులు పెడుతున్న జ‌గ‌న్‌.. త‌న మాతృమూర్తి గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు గుర్తు చేసుకోవాల‌ని టీడీపీ అభిమానులు, నెటిజ‌న్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on January 22, 2023 6:53 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

పుష్ప-2 ఓపెనింగ్‌పై పోల్స్, బెట్టింగ్స్

మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్‌ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…

1 min ago

రానాను చిరు ఎందుకు కొట్టాడు?

రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…

2 hours ago

సమంతను మ్యాచ్ చేయగలదా అన్నారు.. కానీ

‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…

4 hours ago

సినిమాల్లాగా రాజ‌కీయాల్లోనూ సైలెంట్ స‌క్సెస్‌!

కోలీవుడ్‌లో పిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాయించుకున్న‌యువ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…

5 hours ago

శివన్న సైలెంటుగా హిట్టు కొట్టేశాడు

జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…

5 hours ago

అలా చేస్తే రేపు అసెంబ్లీకి జగన్..కోటంరెడ్డి చిట్కా

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…

6 hours ago