ఏపీలో మైనారిటీ వర్గం ఓట్లు ఒకప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత తీసుకున్న చర్యలు, తీసుకువచ్చిన 4 శాతం రిజర్వేషన్ వంటివి ఆ వర్గాన్ని కాంగ్రెస్‌కు చేరువ చేశాయి. అయితే, వైసీపీ స్థాపించిన తర్వాత ఈ వర్గాన్ని తమవైపు తిప్పుకోవడం జగన్ అండ్ కో సక్సెస్ అయ్యారు. ఈ పరిణామాలతోనే 2014 ఎన్నికల్లో ఏపీలో మైనారిటీ అభ్యర్థులకు ఇచ్చిన స్థానాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది.
అదేసమయంలో టీడీపీ ఆయా స్థానాలను కోల్పోయింది. దీంతో చంద్రబాబు హయాంలో మైనారిటీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదిలావుంటే, గత 2019 ఎన్నికల్లో వైసీపీ.. మరోసారి మైనారిటీ వర్గాల ఓట్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కడప నుంచి గెలిచిన మైనారిటీ నాయకుడు అంజాద్ బాషాకు రెండు సార్లు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు సీఎం జగన్.
అయితే.. ఇప్పుడు పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో మైనారిటీ వర్గం ఎటు మళ్లుతుంది? అనేది ప్రశ్నగా మారింది ఎందుకంటే.. మైనారిటీ వర్గంలో అనేక మంది సీనియర్లు ఉన్నారు. వారిని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో మైనార్టీలకు వారు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా అధిష్టానం వైఖరిపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తాను వైసీపీకి నమ్మిన బంటునని చెప్పుకొనే ఆయనకు కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని ఆయన వర్గం చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికలకు సంబంధించి తన కుమార్తెకు టికెట్ ప్రకటించేసుకున్నారు. తాను పోటీ నుంచి తప్పుకొంటున్నానని చెప్పకనే చెప్పారు. కర్నూలులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మైనారిటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని.. ఇటీవల కర్నూలులో ఈ వర్గం ముస్లింలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. మొత్తంగా చూస్తే.. వైసీపీకి మైనారిటీలు దూరమవుతున్నారనే భావన స్పష్టంగా కనిపిస్తోంది.
This post was last modified on January 22, 2023 12:03 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…