Political News

వ్యాక్సిన్ తయారవుతుంది సరే.. అందేదెప్పుడు?

భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ మొదలైపోయాయి.. ఇక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడమే తరువాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వాళ్ల వ్యాక్సిన్ క్లినియల్ ట్రయల్స్ చివరి దశకు వచ్చేశాయి. ఫలితాలు బాగున్నాయి. వ్యాక్సిన్ రెడీ అయిపోయినట్లే. రష్యా వ్యాక్సిన్ అన్ని ప్రక్రియలూ పూర్తి చేసుకుంది. వచ్చే నెలలోనే మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఇలా రోజుకో వార్త చదువుతున్నాం.

వ్యాక్సిన్ కోసం ఆశగా చూస్తున్నాం. కానీ నిజంగా వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది. మనం వ్యాక్సిన్ వేసుకునే రోజులు ఎప్పుడొస్తాయి అన్న విషయంలో క్లారిటీ లేదు. మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్‌కు అన్ని అనుమతులూ వచ్చి మార్కెట్లోకి రావడం ఈ ఏఢాది అయితే జరగదన్నది నిపుణుల మాట.

మరి విదేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి? అవి మన వరకు ఎప్పుడొస్తాయి అని అడిగితే మాత్రం.. వాటి విషయంలో మరీ ఆశలు పెట్టుకోవద్దని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వివిధ దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్లను ముందు ఆ దేశాల అవసరాలకు తగ్గ స్థాయిలో ఉత్పత్తి చేయడమే సవాలు అని.. కోట్లల్లో డోస్‌లకు ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయని.. ఆ మేరకు పని పూర్తి చేయడానికే కనీసం ఆరు నెలలు పడుతుందని అంటున్నారు.

అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి అగ్ర దేశాలు.. తమ దేశాల్లో తయారయ్యే వ్యాక్సిన్లను సమీప భవిష్యత్తులో బయటికి వెళ్లే అవకాశం ఇవ్వబోవని, కాబట్టి ఎక్కడో వ్యాక్సిన్ రెడీ అయిపోయిందని మనం సంబరపడిపోవాల్సిన పని లేదని అంటున్నారు నిపుణులు. అలాగే విదేశాల్లో తయారయ్యే వ్యాక్సిన్‌లను మన దేశంలో ఉత్పత్తి చేసేందుకు అనుమతులు పొందడం అంతా పెద్ద ప్రక్రియ అని.. కాబట్టి మన దగ్గర తయారయ్యే వ్యాక్సిన్ మీదే ఆశలు పెట్టుకోవాలని.. ఐతే భారత్ బయోటెక్, మరో సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లున్నాయని.. వ్యాక్సిన్ తయారీలో అన్ని దశలూ పూర్తి చేసుకుని, అనుమతులు పొంది.. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయడానికి మన దగ్గరా ఆరు నెలలకు పైనే సమయం పడుతుందని.. కాబట్టి ఈ ఏఢాది వ్యాక్సిన్ మీద ఆశలు పెట్టుకోవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

This post was last modified on July 21, 2020 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్ భుజాల మీద భారతీయుడి బరువు!

మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…

11 minutes ago

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…

14 minutes ago

బేబీని టెన్షన్ పెడుతున్న పుష్ప 2?

బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…

1 hour ago

పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…

1 hour ago

రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…

2 hours ago

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

2 hours ago