Political News

జ‌గ‌న్‌కు ఎవ‌రు కావాలి.. మోడీనా? కేసీఆరా?

ఔను.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఇప్పుడు ఎవ‌రు కావాలి? మోడీ కావాలా? కేసీఆర్ కావాలా? ఇదీ… ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య సాగుతున్న చ‌ర్చ‌. దీనికి కార‌ణం.. బీఆర్ ఎస్ పార్టీని ఏపీలో విస్త‌రించా ల‌ని చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను క‌లుపుకోవాల‌ని.. కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఆలోచ‌న ఎలా ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం త‌ట‌స్థంగానే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఎందుకంటే.. త‌న‌పై ఉన్న కేసుల నేప‌థ్యంలో మోడీతో స‌హ‌క‌రించాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల మాట‌. అంతేకాదు.. వివేకానంద కేసు కూడా ఉంది. ఈ విష‌యాల్లో కేసీఆర్ స‌హ‌కారం ఉండేది లేదు. పైగా ఆయ‌న కేంద్రంలో విస్త‌రించేందుకు కూడా చాలా స‌మ‌యం ప‌డుతుంది. అదే స‌మయంలో ఆయ‌న అస‌లు విస్త‌ర‌ణ‌పైనా.. అనేక సందేహాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే, మ‌రోవైపు, ఏపీలో బీఆర్ఎస్ విస్త‌రిస్తే.. మాత్రం దానిని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చ‌గ‌లిగే శ‌క్తి ఉన్న పార్టీగా బీఆర్ఎస్‌ను భావిస్తున్నారు. అందుకే జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై జ‌గ‌న్ అండ్ కో మౌనంగా ఉంటున్నారు.

వ‌చ్చినా మంచిదే అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. వ్య‌తిరేక ఓట్లు బీఆర్ఎస్‌కు ప‌డితే, అది త‌మ‌కు మేలు చేస్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ బీఆర్ఎస్‌ను బాహాటంగా స‌మ‌ర్ధించే ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. దీంతో బీఆర్ఎస్ ఇప్పుడు జ‌గ‌న్ విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఆయ‌న‌ను క‌లుపుకొనేందుకు ఉత్సాహం ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ వైఖ‌రితో ఒకింత వెనుక‌డుగు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి మున్ముందు ఏం చేస్తుంద‌నేది చూడాలి.

This post was last modified on January 20, 2023 9:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

4 hours ago

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

8 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

9 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

10 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

11 hours ago

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

12 hours ago